`సలార్` టీజర్ చూస్తుంటే.. `కేజీఎఫ్` సినిమాని మళ్లీ తీస్తున్నాడా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. `సలార్`.. కేజీఎఫ్‌కి రీమేక్ అని, లేదంటే ఆ సినిమాకి కాపీ వెర్షన్ అని అంటున్నారు. ఇంగ్లీష్ డైలాగ్, బ్లాక్ థీమ్, హీరో ఎంట్రీ, హీరో గురించి చెప్పడం, యాక్షన్ సీన్, బీజీఎం స్టయిల్, లొకేషన్ సీన్లు సైతం `సలార్`, `కేజీఎఫ్`లో ఒకేలా ఉన్నాయని, అందుకే మళ్లీ ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్` సినిమాని తీస్తున్నాడా అంటున్నారు. అంతటితో ఆగడం లేదు. `సలార్` టీజర్ కంటే `కబ్జా` టీజర్ బాగుందని ట్రోల్ చేస్తున్నారు. ఏదో అనుకుంటే ఇలా ఉసూరుమనిపించారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. `సలార్` కంటే `కేజీఎఫ్ 2` చాలారెట్లు బాగుందని, ఆ రేంజ్‌కి మ్యాచ్ కాలేదంటున్నారు.