పెద్దమ్మ, రుద్రాణి అత్తయ్య ఏం మాట్లాడతారో అని కంగారుగా ఉంది అంటాడు. నేను చూసుకుంటాను అని ధైర్యం చెబుతుంది కావ్య. మళ్లీ చీటీ తీయడం కోసం జార్ లో చెయ్యి పెట్టబోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్య లక్ష్మి ఏం చేస్తున్నావు, పద మీ అమ్మ వాళ్లు వచ్చారు అని చెప్పటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది కావ్య. ఇంట్లోకి వచ్చిన కనకం కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతుంది. తరువాయి భాగంలో పూజ అయిపోయిన తర్వాత టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటారు కావ్య వాళ్ళు.