ఎపిసోడ్ ప్రారంభంలో పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేస్తూ ఉంటాడు శైలేంద్ర. కొడుకు దగ్గరికి వచ్చిన ఫణీంద్ర నువ్వు ఇలా దగ్గరుండి పనులు చేస్తుంటే చాలా బాగుంది దీనిని బట్టి నీకు రిషి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది అంటాడు. ఇష్టమా, తొక్కా..ఇదంతా మిమ్మల్ని ఇంప్రెస్ చేయటానికే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. పంతులుగారు పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడిని పిలిపించండి అంటంతో రిషి, వసుధార కిందికి వస్తారు.