సంప్రదాయ దుస్తుల్లో తెలుగు అందం.. ‘మామా మశ్చీంద్ర’ ఈవెంట్ లో ఈషా రెబ్బా మెరుపులు

First Published | Oct 3, 2023, 10:12 AM IST

తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో వెలిగిపోతూ అభిమానులను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha  Rebba)  చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. పదేళ్లకు పైగా ఈ ముద్దుగుమ్మ మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వెండితెరపై మెరుస్తోంది. 
 

ప్రస్తుతం ఈషా రెబ్బా మంచి ఆఫర్లను దక్కించుకుంటోంది. రీసెంట్ గా ‘దయా’ అనే సిరీస్ తో అలరించింది. కీలక పాత్రలో ఆకట్టుకుంది.  ఇక నెక్ట్స్ ఈ ముద్దుగుమ్మ  సుధీర్ బాబుకు జోడీగా బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. ఈ మూవీ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. 
 


సుధీర్ బాబు - ఈషా రెబ్బా జోడీగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra). నటుడు హర్షవర్దన్ డైరెక్ట్ చేశారు. మృణాళిని రవి మరో హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మాత సునీల్ నారంగ్ నిర్మించారు. 

అక్టోబర్ 6న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ గా జరిగింది. వేడుకలో ఈషా రెబ్బా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. గోధుమరంగు లెహంగా, వోణీలో హాజరై అందరి చూపు తనపైనే పడేలా చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది.
 

తాజాగా ఈవెంట్ కు సంబంధించి ఫొటోలను పంచుకుంది. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సందర్భంగంలో ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది. క్యూట్ లుక్స్ తో, బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు అభిమానులు లైక్స్ చేస్తున్నారు.

ఇక ఈషా రెబ్బా ఇప్పుడిప్పుడు మంచి అవకాశాలను దక్కించుకుంటున్నట్టు కనిపిస్తోంది. మొదటి నుంచి బిగ్ ప్రాజెక్ట్స్ లో ఆఫర్ కోసం ప్రత్నించినా లీడ్ రోల్ పడలేదు. సపోర్టింగ్ రోల్స్ తోనే సరిపెట్టుకుంది. ఇప్పుడిప్పుడు ఈమె కెరీర్ ఆశాజనకంగా కనిపిస్తోంది. 

Latest Videos

click me!