ఎపిసోడ్ ప్రారంభంలో శత్రువులు మన ఇంటికి వచ్చినా ఆదరించే కుటుంబం మనది, స్వప్న ఇక్కడికి రావడం తప్పే కానీ మీరందరూ ఇలా గొడవ పెట్టుకోవడం ఏమీ బాగోలేదు, వదిలేయండి అంటుంది చిట్టి. చిట్టి దంపతులకు నమస్కరించి మాలాంటి వాళ్ళు మీకు బంధువులుగా తగము, మా వల్ల ఫంక్షన్ ఇలా అయినందుకు చాలా బాధపడుతున్నాం అంటూ ఏడుస్తూ స్వప్నని లాక్కొని వెళ్ళిపోతుంది కనకం. ఆ వెనకే బయలుదేరుతారు అప్పు, కృష్ణమూర్తి. మరోవైపు ఇంటికి వచ్చిన కనకంతో పెద్దది నా కన్ను కప్పి వెళ్ళిపోయింది అంటుంది వాళ్ళ పెద్దమ్మ. అప్పుడే వస్తున్న స్వప్నని చూసి ఇంతమంది ఇన్ని మాటలు అన్నా కూడా వెళ్లావు అంటే నీకు ఎంత ధైర్యం అంటూ మందలిస్తుంది పెద్దమ్మ.