డింపుల్ హయాతీ మత్తు చూపులకు ఫుల్ కిక్కు.. ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిన ‘ఖిలాడీ’ భామ ఫోజులు

First Published | Apr 27, 2023, 12:37 PM IST

యంగ్ హీరోయిన్ డింపుల్ హయతీ (Dimple Hayathi) వరుస చిత్రాలతో అలరిస్తోంది. సినిమా సినిమాకు తెలుగు బ్యూటీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ‘రామబాణం’తో అలరించనుంది. 
 

తెలుగు హీరోయిన్, యంగ్ బ్యూటీ డింపుల్ హయతీ ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ  హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది. వచ్చిన అవకాశాలను సరిగ్గా వాడుకుంటూ తన కేరీర్ లో దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తోంది.
 

విజయవాడలో జన్మించిన డింపుల్ హయాతీ హైదరాబాద్ లోనే పెరిగింది. నటిగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. డింపుల్ కాస్తా డిఫరెంట్ గా జర్నీ  సాగిస్తోంది. తెలుగులో ‘గల్ఫ్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది.  
 


ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో వరుసగా అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ‘గద్దలకొండ  గణేష్’ చిత్రంలో డింపుల్ స్పెషల్ డాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగులోనే ఈ బ్యూటీ క్రేజ్ బాగా పెరిగింది. దీంతో స్టార్ హీరోల సరసన జతకట్టే అవకాశం పొందుతోంది.
 

గతేడాది మాస్ మహారాజా సరసన ‘ఖిలాడీ’ చిత్రంలో హీరోయిన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. సినిమా  కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం డింపుల్ కు కలిసి వచ్చింది. ఈ చిత్రంతో ‘పుల్ కిక్క్’సాంగ్ తో హయాతీ కుర్రాళ్ల గుండెల్లో ముద్ర వేసుకుంది. ప్రస్తుతం మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధంగా ఉంది. 

యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand)- శ్రీవాస్ (Sriwass) కాంబోలో వస్తున్న ‘రామబాణం’లో హయతి హీరోయిన్‌. మే5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  నెట్టింట బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

తాజాగా డింపుల్ హయాతీ గ్రీన్ చుడీదార్ లో మెరిసింది. అప్పటికే వెండితెరపై అందాలతో ఉడికించిన ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొట్టింది.  మత్తు చూపులు,  మతులు పోయే ఫోజులతో నెట్టింట దుమారం రేపింది. ఫ్యాన్స్ తో పాటు  నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Latest Videos

click me!