ఓటీటీ వచ్చాక రీమేక్ చిత్రాల ప్రభావం బాగా తగ్గింది. ఇకపై రీమేక్ చిత్రాలు చేయడం అంత సేఫ్ కాదు అని నిర్మాతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. కొన్ని చిత్రాలని మాత్రం రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకి అర్జున్ రెడ్డి చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రంపై మనసుపడ్డాడట. ఆ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
హీరో శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ రీసెంట్ గా చూశారట. ఎలాగైనా హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిందీలో 'సాటర్డే స్టార్' అనే క్రేజీ టైటిల్ అయితే బావుంటుంది అని కూడా అనుకుంటున్నారట. ఆల్రెడీ డివివి దానయ్యతో రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. విచిత్రం ఏంటంటే ఈ మూవీ ఓటిటిలో హిందీ వర్షన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ హిందీలో ఓటిటిలో వచ్చిన చిత్రాన్ని రీమేక్ చేయడం ఎంత పెద్ద రిస్కో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Also Read : వెంకీని తక్కువగా అంచనా వేస్తే అంతే..సంక్రాంతి పోటీలో బాలయ్య రెండుసార్లు దెబ్బైపోయాడు
ఆల్రెడీ కార్తీక ఆర్యన్ అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. షెహజాదా పేరుతో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ మరో రీమేక్ కోసం ప్రయత్నిస్తుండడంతో ఈ యంగ్ హీరో స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే సరిపోదా శనివారం నిజంగా హిందీలో రీమేక్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.