శ్రీ విష్ణుని మోసం చేసిన హీరోయిన్, సడెన్ గా హ్యాండ్ ఇచ్చిందన్న హీరో..

First Published | Dec 25, 2024, 12:53 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణును ఓ హీరోయిన్ మోసం చేసిందట. సడెన్ గా హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ? ఏం చేసింది..? 
 

ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను ఓన్ గా సాధించిన హీరో శ్రీవిష్ణు. కుర్రాడు సాఫ్ట్ అని  అందరితో అనిపించుకున్న ఈ హీరోను ఓ హీరోయిన్ మోసం చేసిందట. ఈ విషయాన్ని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు  శ్రీ విష్ణు.  ఈ హీరో నటించిన సినిమాల్లో  ‘ఓం భీం బుష్’ కూడా ఒకటి.

ఈసినిమాకు సబంధించిన విశేషాలను, అనుభవాలను రీసెంట్  ఇంటర్వ్యూలో  పంచుకున్నాడు. ఈమూవీ హీరోయిన్ వల్ల చాలా కాలం లేట్ అయ్యిందట. షూటింగ్ కొంత  కాలం ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందట.  ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అయేషా ఖాన్ నటించింది. 

ఈమె ఈ చిత్రం చేస్తున్న సమయంలోనే ఆమెకు హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చిందట. ఆ ఆఫర్ రాగానే సినిమాని మధ్యలో వదిలేసి, చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందట అయేషా ఖాన్. దాంతో టీమ్ అంతా షాక్ అయ్యారట.

అంతే కాదు అప్పటికే ఆమెతో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించడంతో.. వేరే హీరోయిన పెట్టుకోవడం కుదరలేదట. అలా చేద్దాం అనుకున్నా బడ్జెట్ చాలా తక్కువ కావడంతో షూటింగ్ ఆపక తప్పలేదట. చేసేదేమి లేక అయేషా వచ్చేదాక వెయిట్ చేశామన్నారు శ్రీ విష్ణు. 


ఇక మళ్ళీ ఆమె 70 రోజుల తర్వాత షూటింగ్ కి తిరిగి వచ్చిందట. అలా ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఆమె కారణంగా ఆలస్యం అయ్యిందని అన్నారు శ్రీ విష్ణు. అయితే అయేషా ఖాన్ కు  బిగ్ బాస్ కు వెళ్లడం వల్ల మంచి పేరు వచ్చింది. అయేషా ఖాన్ బిగ్ బాస్ హిందీ సీజన్ 17 లో టాప్ 8 కంటెస్టెంట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఈమె గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్ లో రూపొందుతున్న  భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ  ‘జాట్’ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక యంగ్ హీరో శ్రీవిష్ణు టాలీవుడ్ కు ఎటువంటి  బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు.  
 

sri vishnu

స్టార్ హీరో  ఇమేజ్ రాకపోయినా.. హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులుపడిన ఈ హీరో.. ఆతరువాత ఓ మోస్తరు హిట్లతో .. పర్వాలేదు అనిపించాడు శ్రీవిష్ణు. అయితే చాలా వరకూ ఫ్యామిలీ ఆడియన్స్ లో శ్రీవిష్ణుకు మంచి ఇమేజ్ ఉంది. సినిమాలంటే ఇష్టంతో  వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఎదిగాడు శ్రీవిష్ణు. హీరోగా  రాకుముందు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు. 

Sreevishnu

చాలా సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన శ్రీవిష్ణు.. 2016 లో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో హీరోగా మారాడు. ఈసినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ, శ్రీ విష్ణు కి మంచి పేరు మాత్రం తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుసగా మంచి మంచి కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ దూసుకుపోయాడు శ్రీవిష్ణు. సక్సెస్, ఫెయిల్యూర్ అన్న తేడా లేకుండా వరుసగా మంచి కథలు తీసుకుని సినిమాలు చేశాడు.

srivishnu

బ్రోచేవారెవరురా, రాజా రాజా చోరా’, ‘సమజవరగమనా’, ‘ఓం భీం బుష్’, ‘స్వాగ్’ వంటి మంచి సినిమాలతో  తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సాధించాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం ఈ హీరో  రెండు సినిమాలకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. అవేంటి అనేది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. 

Latest Videos

click me!