Game Changer, The Raja Saab, Tollywood 2025
2024 వెళ్ళిపోతోంది. మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతోంది. ఈ క్రమంలో 2024లో వచ్చిన హిట్ సినిమాలు, ఫ్లాఫ్ సినిమాలపై విశ్లేషణలు జరుగుతున్నాయి. 2024 తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి ఊపు ఇచ్చిందనే చెప్పాలి.
డిజాస్టర్ సినిమాలు చాలానే ఉన్నా… అంతకు మించి అన్నట్లుగా కల్కి, పుష్ప2, దేవర వంటి చిత్రాలు 2024 టాలీవుడ్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చాయి. ఫ్యాన్ ఇండియా రిలీజ్ లతో బిగ్ నెంబర్స్ నమోదు అయ్యాయి. అదే జోరు కొత్త ఏడాదిలో కంటిన్యూ కాబోతోందనే ఉత్సాహం పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో 2025లో రిలీజ్ కాబోయే అప్ కమింగ్ సినిమాల లిస్ట్‌లో బిగ్ నెంబర్స్ సాధించగలిగే మూవీస్ ఏమిటనేది చూద్దాం.
2025 లో రిలీజ్ కోసం అనేక భారీ చిత్రాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు తమ విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించి అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రవితేజ, నాని, నితిన్, నాగ చైతన్య, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు తమ సినిమాలను కొత్త సంవత్సరంలో విడుదల చేయనున్నారు. కొత్త సంవత్సరంలో చాలా చిత్రాలు ప్లాన్ చేసారు కానీ విడుదల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. 2025 కోసం అప్ డేట్ చేసిన రిలీజ్ ల లిస్ట్ ఇక్కడ ఉంది
ram Charan, Game Changer ,#director shankar, #game changer, #Ram Charan
జనవరి 10th: గేమ్ ఛేంజర్
జనవరి 12: సంక్రాంతికి వస్తున్నాం
జనవరి 14: డాకు మహారాజ్
జనవరి 17: ఎమర్జెన్సీ (హిందీ)
జనవరి 24: స్కై ఫోర్స్ అండ్ లాహోర్ 1947 (హిందీ)
జనవరి 26: మజాకా
జనవరి 31: దేవా (హిందీ)
ఫిబ్రవరి 7: బ్రహ్మ ఆనందం, సుందరకాండ, తాండల్
ఫిబ్రవరి 14: లైలా, ఛావా (హిందీ)
ఫిబ్రవరి 21: కుబేరుడు (అంచనా)
ఫిబ్రవరి 25: తమ్ముడు లేదా రాబిన్‌హుడ్
మార్చి 28: హరి హర వీర మల్లు, సికందర్ (హిందీ)
ఏప్రిల్ 10: రాజా సాబ్ లేదా జాక్, జాట్ , తమ్ముడు లేదా రాబిన్‌హుడ్ (అంచనా)
ఏప్రిల్ 18: మిరాయ్, ఘాటి
ఏప్రిల్ 25: కన్నప్ప (అంచనా)
మే 1: HIT 3, రైడ్ 2 (హిందీ)
మే 9: మాస్ జాతర, విశ్వంబర (అంచనా)
మే 21: మిషన్: ఇంపాజిబుల్ 8
జూన్ 5: థగ్‌లైఫ్, హౌస్‌ఫుల్ 5 (హిందీ)
ఆగస్టు 14: వార్ 2 , ఢిల్లీ ఫైల్స్ (హిందీ)
ఏదైమైనా 2025 ప్రారంభంలో బరిలో దిగుతున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer) మీదే అందరి చూపు ఉంది. వరుస ఫెయిల్యూర్స్ తరువాత శంకర్ చేస్తున్న సినిమా కావటంతో గేమ్ చేంజర్ మీద భారీ హైప్ ఉంది. అలాగే 2025లో చాలా కాలం తరువాత ఫాంటసీ మూవీ చేస్తున్న చిరు, విశ్వంభర (Viswambhara)గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరో ప్రక్క సమ్మర్ బరిలో ఉన్న హరి హర వీరమల్లు (Hara Hara Veera Mallu) మీద కూడా బజ్ గట్టిగానే ఉంది. ఓజీ చిత్రం కూడా 2025లోనే వచ్చే అవకాసం ఉంది. ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలతో పాటు 2024లో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ప్రభాస్.. 2025 లో కూడా అదే జోరు కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నారు. ది రాజాసాబ్ (The Raja Saab), ఫౌజీ (Fauji) సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ రెండు సినిమాలను 2025లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ వార్ 2. హృతిక్‌తో కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద సౌత్‌లో పాటు నార్త్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.