Karthika Deepam: వంటలక్కకు మాటిచ్చిన డాక్టర్ బాబు.. పూజ చెయ్యాలనుకున్న మోనితకు షాక్?

First Published Sep 12, 2022, 7:54 AM IST

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 12వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కార్తీక్ ఇంటికి వచ్చి మోనిత తో, ఆ చిన్న పిల్లని మనం ముందు ఎప్పుడైనా చూసామా? నా గతంలో తనకి ఏమైనా భాగం ఉందా? ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటాడు కానీ మోనిత మాత్రం, లేదు కార్తీక్ మనము ఎక్కడా చూడలేదు, చూస్తే నాకు గుర్తు ఉంటది కదా అని అంటుంది.అప్పుడు కార్తీక్ నేను రోడ్డు మీద చాలా చిన్న పిల్లల్ని చూసాను కానీ ఈ ఒక్క అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడే ఎందుకు సహాయం చేయాలనిపించింది. నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదా? అయినా నా ప్రతి ప్రశ్నకి నీ దగ్గర సమాధానం దొరుకుతుంది అనుకోవడం నా తప్పే. 
 

అవును, ఇంతకీ వంటలక్క వస్తానన్నదా అని కార్తీక్ అడగ్గా, తను ఇంట్లో పూజ సామాగ్రి అంతా కొనుక్కున్నాదంట కార్తీక్,కనుక రాదట అని అంటుంది మోనిత. అప్పుడు కార్తీక్, పోనీలే పూజ చేసుకోని అని వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత, హమ్మయ్య కార్తీక్ అక్కడికి వెళ్ళడు, ఆ దీపా ఇక్కడికి రాదు. సంతోషంగా రేపు పూజ చేసుకోవచ్చు అని అనుకుంటుంది. ఆ తర్వాత రోజు దీప వినాయకుడికి పూజ చేస్తూ, స్వామి నా కోరికలు నీకు తెలియనివి కాదు, నాకు మంచి జరగాలని, డాక్టర్ బాబు తిరిగి నా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాను. సీతమ్మ దేవి రాముడు కోసం ఎంతో ఎదురుచూసింది.
 

 ఇప్పుడు నా రాముడు నాకోసం ఎదురు చూడడం కాదు కదా కనీసం గుర్తు కూడా పట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ మోనిత పీడ వదిలి మళ్లీ మా ఇద్దరి జీవితాల్లోకి ఆనందం రావాలి అని కోరుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత వినాయకుడితో,చాలు స్వామి నాకు ఇంకేమీ వద్దు కార్తీక్ నేను నాకు దక్కేలా చేశావు అదే విధంగా ఆ వంతలక్క నీ తరిమిస్తే చాలు. ఈరోజు నేను కార్తీక్ కలిసి పూజ చేస్తాము కనుక మనఃశాంటి గా ఉండాలి,కోపం తెచ్చుకోకూడదు అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ మోనిత నీ పంచ కట్టమని అడగగా మోనిత నానా తిప్పలు పడుతూ పంచు కట్టలేక జీన్స్ వేసుకోవచ్చు కదా కార్తిక్ అని అంటుంది. 
 

అది చూసిన దీప, శివతో డాక్టర్ బాబుకి పంచ కట్టడం రావట్లేదు వెళ్లి కట్టు అని పంపిస్తుంది. మరోవైపు తను ఏడుచుకుంటూ అన్ని బాగుంటే ఇంత కష్టం వచ్చేదా డాక్టర్ బాబుకి, మోనిత స్థానంలో నేను ఉండే దానిని అని ఏడుస్తూ ఉంటుంది.అంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఏమైంది వంటలక్క బాధగా ఉన్నావు? నీలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది,నాలో కూడా ఏదో తెలియని బాధ ఉంది కానీ ఎంత గుర్తు చేసుకుందామన్న గుర్తు రావట్లేదు. కానీ నీకు నీ బాధ తెలుసు కదా మరి ఎందుకు అలా ఉన్నావు అని అడగగా మీరే నా బాధ డాక్టర్ బాబు ఆ మోనిత వలలో నుంచి మిమ్మల్ని బయటకు తీయాలి అని అనుకుంటుంది. 
 

ఇంతలో పంతులుగారు అక్కడికి వస్తారు. దీపను చూసి మీ బంధువా అని అడగగా,  కాదు వంటలక్క, వంటలు చేస్తూ బతుకుతుంది అని అంటుంది మోనిత. తర్వాత పూజకు ముగ్గురు సిద్ధమవుతారు అప్పుడు మౌనిత, రా కార్తిక్ ఇద్దరు కలిసి పూజ చేద్దాము దంపతులము కదా అని అనగా దీప, డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు మర్చిపోయారా? ఒకవేళ మీరు మర్చిపోతే మీ షర్టులో ఆ కాగితం ఉంటుంది చూసుకోండి అని అంటుంది. పూజలో మీరు ఒకరు మాత్రమే కూర్చోవాలి అనీ కాగితంలో ఉంటుంది. అవును వంటలక్క నాకు అంత గుర్తొచ్చేసింది అని కార్తీక్ అంటాడు. అప్పుడు మోనిత, ఏం మాట్లాడుతున్నావ్ కార్తీక్ పూజలో ఒకడివే కూర్చోవడం ఏంటి?
 

 దీని గురించి నీకు అర్థం కావడం లేదు నిన్ను వలలో వేసుకుంటుంది అని అనగా కార్తీక్, ఆగు మోనిత తను చెప్పేది మన మంచికే, తను ఏం చెప్పిందో తెలుసా నా భార్యకి ఏ కష్టము రాకూడదు,మంచే జరగాలి మా ఇద్దరి మధ్య ఏ మూడో మనిషినా తొలగిపోవాలి, మేము సంతోషంగా ఉండాలి అని కోరుకోమన్నది తెలుసా అని అనగా పంతులుగారు, పరాయి మనిషి అని చెప్పారు కానీ మీ గురించి ఇంత బాగా ఆలోచిస్తుంది అని అంటాడు. అప్పుడు పూజ మొదలుపెడదాం అన్న సమయానికి దీప,డాక్టర్ బాబు మీకు ఎప్పుడైనా వినాయకుడు పూజ జరిగినట్టు గుర్తున్నాదా? అసలు ఏ సంఘటనైనా గుర్తొస్తుందా అని అంటుంది.
 

 అప్పుడు కార్తీక్, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కార్తీక్ కి ఒక దృశ్యం కనిపిస్తుంది. అందులో చాలామంది కలిసి పూజ చేస్తున్నట్టు, కానీ వాళ్ళ మోకాలు కనిపించవు. అంతలో మోనిత,ఇంక చాలు కార్తీక్ పదా పూజ చేద్దాం అని అంటుంది. అప్పుడు పంతులుగారు,నువ్వు అసలు ఆయన భార్యవేన అమ్మ, గతం గుర్తురాని మనిషికి ఆవిడ గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో అడ్డుకుంటున్నావు అని తిడతాడు. ఇంతలో కార్తీక్ ఒక్కడే వెళ్లి పూజ చేస్తాడు. అప్పుడు దీప, చూసావా ఇదే నేను నీకు ఈరోజు ఇచ్చే వినాయక చవితి గిఫ్ట్. నిన్ను డాక్టర్ బాబు పక్కన కూర్చొని పూజ చేయించలేదు అని అంటుంది.
 

అప్పుడు పూజ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ ఇల్లుకు వెళ్ళిపోతారు. అప్పుడు మోనిత కార్తీక్ తో, అసలు దాని ఇంటికి ఎప్పుడెల్లావ్ కార్తీక్ అని అరుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!