కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్: జ్యోకు సుమిత్ర వార్నింగ్.. దీపపై చాడీలు చెప్పకు.. కాశీ నా సొంత తమ్ముడు

Published : Sep 27, 2025, 09:01 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (సెప్టెంబర్ 27వ తేదీ)లో దీపపై చాడీలు చెప్పకు జ్యోత్స్న అంటుంది సుమిత్ర. కాశీ నా సొంత తమ్ముడు అంటుంది జ్యో. నువ్వు మారిపోయావు స్వప్న అంటాడు కాశీ. మేము ఏం చేయాలో మాకు తెలుసు అంటాడు కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

PREV
14
కార్తీక దీపం 2 లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 శనివారం ఎపిసోడ్ లో నిన్ను ఎన్నిసార్లు లేపాలి కాశీ అంటుంది స్వప్న. ఇంతకుముందు అయితే ఈ టైంలో హడావిడిగా ఆఫీసుకు వెళ్లేవాడివి. నీకు బాక్సు, బాటిల్ అందిస్తూ.. మరోపక్క వేరే పనులు చేస్తూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు ఈ టైం వరకు నిద్రపోతున్నావు అంటుంది. అందుకు కాశీ ఫీల్ అవుతాడు. జాబ్ లేనివాడంటే ఎవ్వరికైనా లోకువే. నీ మాటలు మారిపోయాయి. ఒకవేళ నేను నైట్ షిఫ్టు చేసి పడుకొని ఉంటే ఇలా మాట్లేడేదానివా.. అని అంటాడు. 

నాకు నైట్ అంతా నిద్రపట్టలేదు. అందుకే ఇప్పుడు పడుకున్న.. జాబ్ లేని వాళ్లు 9 గంటల వరకు పడుకోకూడదు అంతే కదా.. అంటూ కోపంగా లేస్తాడు. వీరి ఇద్దరి మాటలు బయటినుంచి విన్న శ్రీధర్.. కావేరితో స్వప్నను కాస్త జాగ్రత్తగా మాట్లాడమని చెప్పు. ఇలాంటి టైంలో మన మాటలు కాశీకి భరోసానిచ్చేలా ఉండాలి అని చెప్తాడు. అందరూ ఒకేలా ఉండరు. ఉదాహరణకు కార్తీక్ చూడు.. కుటుంబంతో సహా రోడ్డుపై పడ్డాడు. అయినా సరే నిలదొక్కుకొని తనంటే ఏంటో ఫ్రూవ్ చేసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటలను కాశీ అపార్థం చేసుకుంటాడు.

24
జ్యోకు సుమిత్ర వార్నింగ్

దీపను బయటకు గెంటెయ్ మమ్మీ అంటుంది జ్యోత్స్న. దీప డాడీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? డాడీకి నీకు గొడవ జరగడానికి కారణమే దీప కదా అంటుంది. అందుకు సుమిత్ర.. నీ మాట విని నేను తప్పు చేశాను. నా భర్త నాపై కోపం చూపించలేదు. నాలోని తప్పు చేసిన మనిషిపై చూపిస్తున్నాడు. ఇన్నేళ్ల మా కాపురంలో నేను ఎలా ఉంటాను? ఏ పని చేస్తాను? ఏ పని చేయలేను? అనే విషయాలు తనకు తెలియవా.. నేను తప్పు చేశానని మాత్రమే తనకు తెలుసు. అది నువ్వు చేయించావని తెలిస్తే అస్సలు ఊరుకోడు అంటుంది.

దీపపై చాడీలు చెప్పడం మానేయ్. టైం వేస్ట్ చేసుకోకుండా సీఈఓ పదవి కాపాడుకునే ప్రయత్నం చేయ్ అంటుంది సుమిత్ర. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది లోలోపల.

34
నీ మాట ఎవ్వరూ వినలేదు

శ్రీధర్ ఇంటికి వాళ్ల బావమరిది, అతని భార్య అంటూ రెండు కొత్త క్యారెక్టర్లు వస్తాయి. అతను పెళ్లికి పిలవడానికి వచ్చి శ్రీధర్ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడుతాడు. నీ కూతురు అలా.. కొడుకు ఇలా.. ఎవ్వరు నీ మాట వినలేదు కదా అనీ అని అంటాడు. శ్రీధర్ అతనికి గట్టిగానే సమాధానం చెప్పి పంపిస్తాడు.

44
మనమే వాళ్లతో ఆడుకోవాలి

సుమిత్ర మాటలను గుర్తుచేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో అక్కడికి పారు వస్తుంది. నన్ను మొత్తానికే వదిలేశావా.. అందుకేనా చిన్నప్పుడు నన్ను మార్చింది అంటుంది జ్యోత్న్స. సెంటిమెంట్స్ పండించకు అంటుంది పారు. ఈ ఇంట్లో ఎలాంటి పరిస్థితిలో అయినా నాకు తోడుగా ఉండేది గ్రానీ మాత్రమే. తనని దూరం చేసుకోవద్దు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నేను కాశీకి జాబ్ ఇప్పించాలి. ఖర్చులకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నా.. కాశీ నా సొంత తమ్ముడు అంటుంది జ్యోత్న్స. 

ఆ మాట విన్న కార్తీక్.. కాశీ నీకు సొంత తమ్ముడు ఎలా అవుతాడు అంటాడు. కాశీ మా బాబాయ్ కొడుకు. కాబట్టి నాకు తమ్ముడు అంటుంది జ్యోత్స్న. తనతో ఎన్నో పనులు చేయించుకున్నారు. ఇప్పుడు వాడికి అవసరమైనప్పుడు మీరు సహాయం చేయడం లేదు. ఇంతేనా మీ ప్రేమ అని జ్యోత్న్స కార్తీక్ ను ప్రశ్నిస్తుంది. మీతో చెప్పించుకునే స్థాయిలో మేము లేము. నా చెల్లెలు తన భర్త గురించి నా తండ్రి చూసుకుంటాడు అంటాడు కార్తీక్. 

వీడికి ఛాన్స్ ఇవ్వకూడదు ఇస్తే చెడుగుడు ఆడుకుంటాడు అంటుంది పారు. అయితే మనమే వాళ్లతో ఆడుకోవాలి గ్రానీ అనీ జ్యోత్స్న అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories