Oke Oka Jeevitham Review: శర్వానంద్‌ `ఒకే ఒక జీవితం` సెలబ్రిటీ రివ్యూ.. కన్నీళ్లే..

First Published Sep 8, 2022, 1:12 AM IST

శర్వానంద్‌, రీతూ వర్మజంటగా నటించిన బైలింగ్వల్‌ మూవీ `ఓకే ఒక జీవితం` సినిమాని సెలబ్రిటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి సినిమాపై సెలబ్రిటీల రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. 

శర్వానంద్‌, రీతూ వర్మ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ `ఒకే ఒక జీవితం`. శ్రీకార్తిక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమల, ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్‌ వారియర్స్ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ ఆర్‌ ప్రభు నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 9(శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్రాన్ని సెలబ్రిటీలకు ప్రత్యేకంగా షోస్‌ వేశారు. ఇందులో నాగార్జున, అఖిల్‌తోపాటు యంగ్‌ డైరెక్టర్స్ పాల్గొని సినిమాపై తమ రివ్యూని వెల్లడించారు. మరి సెలబ్రిటీ రివ్యూస్‌ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Oke Oka Jeevitham Celebrity Review.
 

సినిమా చూసిన అనంతరం నాగార్జున మాట్లాడుతూ, సినిమాపై తన రివ్యూని వెల్లడించారు. చాలా ఎమోషనల్‌ ఫిల్మ్ అని, చాలా బ్యూటీఫుల్ గా ఉందని బరువెక్కిన హృదయంతో చెప్పారు. అమ్మ ప్రేమ గుర్తొచ్చిందంటేకన్నీ ఆగవన్నారు. తనకు వాళ్లమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తొచ్చినట్టు తెలిపారు నాగ్‌. దీనిపై అమల చెబుతూ, అందరితో కలిసి చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా అనిపించిందని, దాన్నుంచి ఇంకా కోలుకోలేదని, నాగార్జున గారు కన్నీళ్లతో మా అమ్మని తీసుకొని వచ్చారని తెలిపారు. 
 

నిర్మాత వై రవిశంకర్‌ చెబుతూ, సినిమా అత్యద్బుతంగా ఉందన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదని, కచ్చితంగా అందరికి చాలా బాగా నచ్చుతుందని, సెంటిమెంట్‌, ఎమోషనలే కాదు, నావెల్టీ చాలా బాగుందని, పాయింట్‌ చాలా కొత్తగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌, రీతూ వర్మ, శర్వానంద్‌ ల నటనపై ప్రశంసలు కురిపించారు. అమలగారు గొప్ప నటి అని మరోసారి నిరూపించారని తెలిపారు.  

దర్శకుడు హను రాఘవపూడి సినిమా చూశాక తన రివ్యూ చెబుతూ, `ట్రైమ్‌ ట్రావెల్స్ లో చాలా రకాల థింగ్స్ చూశాం గానీ, ఇది ఎమోషన్స్ కరెక్ట్ చేసుకోవడానికి తీసిన సినిమా అని, ఏదో ఒక సందర్భంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చాలా వెలితి ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి సై ఫై వాడి తీసిన చిత్రం. చాలా సందర్భాల్లో నిజంగా ఏడిపించింది. ఇదొక జెన్యూన్‌ మూవీ. నటీనటుల నటన పీక్‌లో ఉంది. చిన్న పిల్లల దగ్గర్నుంచి, ప్రతి చిన్న పాత్ర కూడా అద్భుతంగా చేశారంటూ ప్రశంసలు కురిపించారు.
 

మరో దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తన రివ్యూని వెల్లడిస్తూ, ఈ సినిమా మా మమ్మీతో చూడటం నా అదృష్టం. చాలా మూవ్‌మెంట్స్ గుర్తొచ్చాయి. చాలా ఎమోషనల్‌ అయ్యానని చెప్పారు. మరో దర్శకుడు వెంకటేష్‌ మహా తన వ్యూ చెబుతూ, ఇంటెన్షన్స్, ఎమోషన్స్ ఇలా ప్రతిదీ రైట్‌ ప్లేస్‌లో ఉన్నాయి. టెక్నీకల్లీ ఇది బ్రిలియంట్‌గా ఉందన్నారు. 

దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తన రివ్యూ వెల్లడిస్తూ, సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం చాలా రోజుల తర్వాత జరిగింది. ఏడిస్తే బాగోదని చాలా సన్నివేశాల్లో కన్నీళ్లు ఆపుకున్నా. మోస్ట్ బ్యూటీఫుల్‌ ఫిల్మ్. చిత్ర దర్శకుడు శ్రీ కార్తిక్‌ తన మదర్ కి ఇంత కంటే గొప్ప ట్రిబ్యూట్‌ ఇవ్వలేరు అనిపించింది అని తెలిపారు. `రాధేశ్యామ్‌` దర్శకుడు రాధాకృష్ణ చెబుతూ, ఇదొక ఫైనెస్ట్ ఫిల్మ్ అని ప్రశంసలు కురిపించారు. సైన్స్ ఫిక్షన్‌లో ఎమోషన్స్ తీసుకురావడమనేది రియల్లీ నైస్‌ అని చెప్పారు. 

దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య సినిమా చూశాక తన రివ్యూ చెబుతూ, నేను చూసిన అత్యంత ఎమోషనల్ ఫిల్మ్ ఇది. అంత క్రియేటివ్‌గా, అంత ఎమోషనల్‌గా తీయడం మామూలు కాదు` అని తెలిపారు. హీరోయిన్‌ రీతూ వర్మ సైతం తన ఫీలింగ్‌ చెబుతూ, సినిమా చూశాక నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. గుండె బరువెక్కింది. బ్యూటీఫుల్ ఫిల్మ్, అద్బుతమైన నటన, ఏం చెప్పాలో అర్థం కావడం లేదని చెప్పింది. కమెడియన్ ప్రియదర్శి సినిమా చూశాక మాట్లాడుతూ, మాటల్లేవని చెప్పారు. నా జీవితంలోనే అత్యంత గొప్ప అనుభూతి ఇప్పుడు పొందాను. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పారు ప్రియదర్శి. ఆయన సినిమా చూశాక థియేటర్‌ నుంచి కన్నీళ్లతో బయటకు రావడం విశేషం. 
 

click me!