Karthika Deepam: దీపను వదిలించుకునే ప్రయత్నంలో కార్తీక్.. శౌర్య దగ్గరే ఉంటానంటున్న హిమ!

First Published Sep 24, 2022, 9:12 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 24వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. సౌందర్య, ఆనంద్ రావు కారులో మోనిత ఇంటి నుంచి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు సౌందర్యతో, చాలా నిరాశ పడినట్టున్నారు అని అనగా, అసలు ఆశ పెట్టుకుంటేనే కదా! అయినా అంత జరిగిన తర్వాత కూడా కార్తీక్ బతికే ఉంటాడు అని ఎలా అనుకుంటాను, ఒకవేళ బతికినా సరే ఇప్పటివరకు మనల్ని కలవకుండా ఉండడు కదా అని అంటుంది. అప్పుడు ఆనందరావు, అయినా నాకు దీప, మోనిత ఒకేలాగా కనిపిస్తారు.కార్తీక్ గొప్పవాడే కానీ కార్తీక్, దీప ని తప్పుగా చూసిన తనని తాను నిరూపించుకొని కార్తీక్ ని వదలకుండా ఆఖరికి తన ప్రేమను గెలిచింది. అలాగే మోనిత కూడా కార్తీక్ ని వదలకుండా జీవితాంతం కార్తీక్ వెన్నంటే ఉంది  ఇలాంటి విషయంలో మోనిత తప్పు చేసి ఉండదు అని అనుకుంటారు. 

ఆ తర్వాత సీన్లో శివ, మోనిత దగ్గరికి వెళ్లి,ఇందాక వచ్చిన వాళ్ళు నిజంగానే సార్ వాళ్ళ అమ్మానాన్నల అని అనగా వాళ్ళు ఎవరైతే నీకెందుకు అని అంటుంది మోనిత.ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి, ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరూ అని అడగగా మోనిత, శివ వాళ్ళ అమ్మ నాన్నలు అని చెప్తుంది. అప్పుడు శివ ఉలిక్కిపడతాడు. మరి శివని కలవలేదు ఎందుకు అని కార్తీక్ అడగగా, చూస్తే మళ్ళీ శివ ఇంటికి వస్తాను అని చిన్న పిల్లాడులా మారం చేస్తాడు అందుకే శివని కలవలేదు, నాతో మాట్లాడి వెళ్లిపోయారు అని అంటుంది. అప్పుడు కార్తీక్, పందిలా ఎదిగావు, ఇంకా చిన్నపిల్లల ఇంటికి వెళ్తాను అండమేంటి, కష్టపడి పని చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు.

అప్పుడు శివ మోనిత తో, మీరు ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు మేడం నన్ను అని అంటాడు. మనసులో, ఇన్నాళ్లు నాకు అనుమానం వచ్చేది కానీ ఇప్పుడు కచ్చితంగా చెప్తున్నాను ఈవిడ సర్ భార్య కాదు,లేకపోతే వచ్చిన వాళ్ళు ఎవరో అంటే నిజం చెప్తారు కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత దీప జరిగిన విషయం అంత ఇలా వాళ్ళ అన్నయ్యకు చెప్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య,ఇంక కష్టాలన్నీ పోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది గతం గుర్తొచ్చేలా చేయడం అంతకుమించి మనకు ఇంకేం అర్గాలు లేవు అని అంటాడు. ఇంతలో అక్కడికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి, మేము ఈ కాలనీ అసోసియేషన్ మెంబర్స్. రేపు యానివర్సరీ ఉంది, కనుక మీరు వంటలు చేస్తారా, మీ వంటలు బాగుంటాయని ఇక్కడ మంచి పేరు ఉన్నది అని అనగా, తప్పకుండా చేస్తాను అని అంటుంది దీప. 

అప్పుడు వాళ్లు, రేపు అలాగే ఆటలు, పాటలు అన్నీ జరుగుతాయి తప్పకుండా రావాలి అని చెప్తుంది. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత దీప వాళ్ళ అన్నయ్య, ఈ సమయంలో కూడా ఇవన్నీ ఎందుకమ్మా అని అనగా, నాకు ఈ సమయంలో కావాల్సింది పదిమంది తోడు అన్నయ్య,అలాంటిది ఇక్కడే దొరుకుతుంది అని అంటుంది దీప. ఆ తర్వాత సీన్లో సౌర్య, హిమ దగ్గరకు వెళ్లి భోజనం ఇస్తుంది. ఇది బిర్యానీ ఆ అని హిమ అడుగగా,పులిహోర అని అంటుంది శౌర్య. పర్లేదు నేను ఏదైనా తింటాను అని హిమా అంటుంది. అప్పుడు శౌర్య, నువ్వు ఇక్కడ ఉండలేవు తాతయ్యకి ఫోన్ చేయు నువ్వు నేను ఒకటి కాదు అని అంటుంది. అప్పుడు హిమ, మనిద్దరం కవలము అయినప్పుడు నేను నువ్వు ఎందుకు ఒకటి కాదు అని అనగా, శౌర్య, నేను ఇక్కడ నుంచి ఊరంతాను నడగలను కానీ నువ్వు స్కూల్ నుంచి ఇంటికి నడిస్తేనే జ్వరం తెప్పించుకుంటావు.
 

నువ్వు ఇక్కడ ఉండలేవు హిమ దయచేసి వెళ్ళిపో అని అంటుంది. కానీ హిమ మాత్రం వెళ్ళకుండా ఇల్లు ఎవరిది అని అంటుంది.మన తాతది అని శౌర్య వెటకారిస్తుంది. అయితే ఇల్లు కూడా మనదే అనమాట అని హిమ నవ్వుతుంది.వెళ్ళమంటే ఎందుకు వెళ్ళట్లేదు అని సౌర్య అనగా హిమ మనం పిన్ని బాబాయ్ ల ఇంటికి వెళ్దామా అని అంటుంది. అప్పుడు శౌర్య మనసు,లో ఇప్పుడు అక్కడికి వెళ్తే నిన్ను నన్ను ఇద్దర్నీ ఇంక నానమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు అని అనుకుంటుంది శౌర్య. నువ్వు వెళ్ళిపో ప్లీజ్ అని సౌర్య అనగా హిమ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో కార్తీక్,దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు కార్తీక్ అని అనగా అసలు ఆ వంటలక్క బాధేంటి?ఎప్పుడు చూసినా నా వెనుకాతులు తిరుగుతది, ఇంకేం పని లేదా అని అంటాడు. 

అప్పుడు మోనిత,అప్పట్లో కూడా అంతే కార్తీక్ నీ వెనకాతలే తిరిగేది, నేను అందుకే భయపడుతున్నాను ఎప్పుడు దాని దగ్గర నుంచి నిన్ను  దూరం పెడదామా అని చూస్తున్నాను. ఇంక తన గోల పెరిగిపోతుంది, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాము అని అనగా, మనమెందుకు వెళ్లిపోవడం.  వెళ్ళిపోతే వాళ్ళు చెప్పిందే నిజం అనుకుంటారు వంటలక్క నా భార్య అని నమ్ముతారు అని అనగా, ఆ మాట పొరపాటున కూడా నోట్లో నుంచి రావద్దు అని అంటుంది మోనిత. అప్పుడు కార్తీక్, అలాంటి అప్పుడు మనం వెళ్లాల్సిన అవసరం లేదు తన్నే పంపించే ప్రయత్నం చేద్దాము అని అనుకోని దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. అప్పుడు దీప కూరగాయలు పట్టుకొని బయటకు వెళ్తుండగా ఇక్కడకు వచ్చారేంటి డాక్టర్ బాబు లోపలికి రండి అని అంటుంది. మీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి తలుపు తీస్తాడు.

అప్పుడు దీప మనసులో, మీరు అని పిలుస్తున్నారు ఏంటి అని అనుకుంటుంది. లోపలికి వచ్చిన తర్వాత కార్తీక్ దీపతో, నేను మీ డాక్టర్ బాబుని కాదని నేను నీకు చాలా సార్లు చెప్పాను అయినా సరే మీరు తిరిగి వెంటపడుతున్నావు. అందరూ డబ్బు కోసమే మీరు ఇలా చేస్తున్నావో అని అంటున్నారు, ఒకవేళ అదే నిజమైతే డబ్బులు తీసు కొండి అని  డబ్బులు ఇస్తాడు. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేసి,మా దగ్గరికి రావద్దు, దూరంగా వెళ్లిపో అని అంటాడు. ఇంతలో మోనిత ఫోన్ చేసి ఎక్కడున్నావ్ కార్తిక్ అని అనగా,వంటలక్క దగ్గర ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాడు. మోనిత కంగారుగా అక్కడికి వచ్చి చూస్తుంది. అప్పటికే కార్తీక్ దీప ను తిడుతూ, నువ్వు  నా భార్యవి అని  నువ్వు చెప్తూ ఉంటే నాకు వినడానికి చాలా ఇబ్బంది గా ఉన్నది.మోనిత అయితే పాపం భాయపడి పడిపోతుంది.ఇంటి నుంచి వెళ్ళిపోదాం అంటుంది. నువ్వు మాకు ఎన్ని సమస్యలు తెస్తున్నావో తెలుసా అని అనగా అది బాధ  కాదు డాక్టర్ బాబు నేను మిమ్మల్ని దక్కించుకుంటానెమో అని భయం అని అనుకుంటుంది.అప్పుడు దీప, నాకు ఈ డబ్బులు.. అని అనగా ఈ డబ్బులు నీవే అని చెప్పాను కదా ఇంక నాకు వద్దు అని అంటాడు.
 

నేను ఈ డబ్బులు మీకు ఇస్తానని కూడా నేను చెప్పలేదు, నా భర్త నాకు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం నా హక్కు.నా భర్తకి నచ్చిన చీర, నా భర్తకు నచ్చిన నగలు కొనుక్కుంటాను అని అంటుంది.అప్పుడు కార్తీక్ నువ్వు ఇంకా మారవా అని అనగా మోనిత అక్కడికి వెళ్లి, ఆవిడ అంతే కార్తీక్ ఇంకా మారదు అని కార్తీక్ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో సౌందర్య, ఆనందరావు పిల్లలు కోసం బాధపడుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య, బాధపడడం ఇంకా వద్దండి రేపు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఊరంతా పిల్లల కోసం వెతికిపిద్దాం.ఇలా హోటల్ రూమ్లో కూర్చుని ఏడుచుకోవడం కాదు రేపు మధ్యాహ్నం కల్లా పిల్లలు మన దగ్గరికి వస్తారు అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో  దీప దేవుడికి ప్రార్థిస్తూ, దేవుడా నేను ఇప్పుడు ఒక సాహసమైన అడుగు వేయబోతున్నాను. ఇన్ని రోజులు డాక్టర్ బాబుకి గతం లో కొన్ని సంఘటన గుర్తుతెస్తే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు అది ఏమాత్రం ప్రభావితం అవడం లేదు. ఇప్పుడు నేను చేసే ఈ ప్రయత్నానికి నాకు సహాయం చేయు అని అంటుంది.ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!