బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్‌.. భారీగా `చెన్నకేశవరెడ్డి` రిలీజ్‌.. రికార్డుల మోతకి రంగం సిద్ధం..

Published : Sep 24, 2022, 08:40 AM ISTUpdated : Sep 24, 2022, 07:53 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి`చిత్రంతో థియేటర్లో సందడి చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పుడు పవర్‌ స్టార్‌ పవన్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌లకు సవాల్‌ విసరబోతున్నారు. ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌.

PREV
17
బాలయ్య ఫ్యాన్స్ కి ట్రీట్‌.. భారీగా `చెన్నకేశవరెడ్డి` రిలీజ్‌.. రికార్డుల మోతకి రంగం సిద్ధం..

స్టార్‌ హీరోల బర్త్ డేలకు వారి సూపర్‌ హిట్‌ సినిమాల రీ రిలీజ్‌లు ట్రెండ్‌గా మారింది. ఇటీవల మహేష్‌బాబు `పోకిరి`, పవన్‌ కళ్యాణ్‌ `తమ్ముడు`, `జల్సా` చిత్రాలు థియేటర్లో రచ్చ చేసిన విషయం తెలిసిందే. పవన్‌ `జల్సా` ఏకంగా నాలుగు కోట్లు వసూలు చేసింది. 

27

ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది. ఆయన నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ఒకటి `చెన్నకేశవరెడ్డి`.  వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్‌ నిర్మించారు. 2002, సెప్టెంబర్‌ 25న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమా ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాని మళ్లీ రిలీజ్‌ చేస్తున్నారు. 

37

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, యూఎస్‌లోనూ భారీగా రిలీజ్‌ చేస్తున్నారు. పవన్‌, మహేష్‌ లను బీట్‌ చేయాలని కంకణం కట్టుకున్నారు బాలయ్య అభిమానులు. ఈ సినిమాని భారీగా సక్సెస్ చేయాలని, పవన్‌ `జల్సా` కలెక్షన్లని బ్రేక్‌ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏకంగా నాలుగు వందల థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. నైజాంలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు సుమారు 47థియేటర్లు కాగా, ఏపీలో మూడువందలకుపైగా ఉండబోతుందట.
 

47

అలాగే ఓవర్సీస్‌లో 55 స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నారు. ఓవర్సీస్‌లో బుకింగ్‌ విషయంలో `చెన్నకేశవరెడ్డి` రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి యూఎస్‌లో 30వేల డాలర్లు అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది. ఇది రికార్డుగా చెప్పొచ్చు. 

57

ఈ రోజు సాయంత్రం నుంచి సినిమా షోస్‌ పడబోతున్నాయి. రేపు డే మొత్తం `చెన్నకేశవరెడ్డి` సందడి ఉండబోతుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందింది. టబు, శ్రియా కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

67

ఇక ఈచిత్రం రీ రిలీజ్‌ ద్వారా వచ్చిన కలెక్షన్లని బసవతారం క్యాన్సర్‌ ఆసుపత్రికి డోనేట్ చేయబోతున్నట్టు ఇటీవల దర్శక, నిర్మాతలు వివి వినాయక్‌, బెల్లంకొండ సురేష్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు షూటింగ్‌ సమయంలో బాలయ్యతో పని చేసిన అనుభవాలను పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.  
 

77

ఇటీవల `అఖండ`తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. కెరీర్‌లోనే అత్యధికంగా కలెక్షన్లని సాధించారు.  ఇప్పుడు ఆయన `ఎన్బీకే 107` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శృతి హాసన్‌ కథానాయిక. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories