టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్లు.. పెళ్ళి ఎప్పుడంటున్న నెటిజన్లు..?

First Published Jan 25, 2022, 7:06 AM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకు పెళ్ళి ఈడు వచ్చేసింది.. మరికొంత మందికి పెళ్ళి టైమ్ వచ్చి వెళ్ళిపోతుంది కూడా.అయినా సరే పెళ్లి మాటకు ఆమడ దూరంలో ఉన్నారు హీరోయిన్లు. వయసైపోతున్నా.. మూడు ముళ్శు పడని స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు  చూద్దాం.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిల్లకు కొదవ లేదు. నగ్మ, టబు లాంటి హీరోయిన్లు అసలు పెళ్ళే చేసుకోలేదు... కాని ఇప్పటి హీరోయిన్లు కూడా చాలామంది  పెళ్లి ఊసు ఎత్తకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ తోటి హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకుని తమ దారి తాము చూసుకుంటుంటే.. ఈ హీరోయిన్లు మాత్రం పెళ్లి మాట ఎత్తకుండా కామ్ గా కాలం గడిపేస్తున్నారు.

టాలీవుడ్ బ్యాచిలర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందు ఉండేది అనుష్క(Anushka) పేరే. ఈ విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన బెంగుళూరు బ్యూటీ..40 ఏళ్లు వచ్చినా పెళ్ళి ఊసు లేకుండా హాయిగా గడిపేస్తుంది. ఆమధ్య ప్రభాస్ తో ప్రేమ.. పెళ్ళి అంటూ చాలా రూమర్స్ వచ్చాయి.. ఫారెన్ లో వీరు ఇల్లు కూడా కట్టుకున్నారంటూ పుకార్లు చాలా షికారు చేసినా.... అవన్నీ పట్టించుకోకుండా హాయిగా గడిపేస్తుంది స్వీటి. ఇప్పటికీ పెళ్ళిపై క్లారిటీ ఇవ్వలేదు.

బ్యాచిలర్ హీరోయిన్ల లిస్ట్ లో అనుష్క(Anushka) తరువాత సెకండ్ ప్లేస్ త్రిషదే. అనుష్కు 40 ఏళ్లు వస్తే.. త్రిష(Trisha)కు 38 ఏళ్లు వచ్చాయి. అయితే.. త్రిష పెళ్లి చేసుకోవాలి అని రెండు మూడు సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యింది కూడా. చెన్నైలో ఓ బిజినెస్ మెన్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న త్రిష. ఆతరువాత బ్రేకప్ చెప్పేసి హ్యాపీగా సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్టు ఉంటుంది. గతంలో టాలీవుడ్ యంగ్ స్టార్ రానాను చేసుకుంటుంది అన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి.

త్రిష(Trisha) తరువాత పెళ్ళి కాని బ్యాచిలర్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో ముచ్చటగామూడో స్థానంలో ఉంది నయనతార(Nayanthara). 37 ఏళ్ల ఈ సీనియర్ హీరోయిన్ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ను వదిలేసి.. తాజాగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే పెళ్లి పై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వడం లేదు నయన్. గతంలో పెళ్ళి వరకూ వచ్చి.. శింబుతో, ప్రభుదేవాతో బ్రేకప్ అవ్వడంతో... విఘ్నేష్ తో అయినా బంధం జీవితాంతం ఉంటుందో లేదో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో పోకిరి లాంటి సూపర్ హిట్ సినిమాలలో బాగం అయ్యింది హీరోయిన్ ఇలియాన (Ileana). అప్పట్లో ఆమె జీరో సైజ్ నడుముకు తెగ ఫ్యాన్స్ ఉండేవారు. ఇలియాన(Ileana) నడుమూ అంటూ సామెతలు కూడా పేలేవి. రాను రాను ఫెయిడ్ అవుట్ అయిన ఈ బ్యూటీ.. తన తోటి హీరోయిన్లు శ్రియా లాంటివారు పెళ్ళి చేసుకుని సెటిల్ అయినా.. తాను మాత్రం ఇంకా హీరోయిన్ గా ట్రై చేస్తూనే ఉంది. 35 ఏళ్ళు దాటిపోతున్నా.. పెళ్ళి ఊసు లేకుండా గడిపేస్తుంది ఇలియాన. రీసెంట్ గా రవితేజ(Ravi Teja) తో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో తన లక్ ను మరో సారి పరీక్షించుకుంది ఇల్లూ బేబీ.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ల లిస్ట్ లో శ్రుతి హాసన్(Shruthi Hasan) పేరు కూడా ఉంది. హీరోయిన్ గా లాంగ్ కెరీర్ ను చూడకపోయినా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవించింది శ్రుతి హాసన్. కమల్ హాసన్(Kamal Hasan) కూతురుగా కాకుండా ఇండస్ట్రీలో తన ఓన్ ఇమేజ్ ను సాధించిన శ్రుతి లైఫ్ ను ఎంజాయ్ చేసే మూడ్ లోనే ఎక్కువగా ఉంటుంది. గతంలో ఫారెనర్ తో ప్రేమాయణం సాగించి.. పబ్లిక్ గానే బ్రేకప్ చెప్పిన బ్యూటీ..ఇప్పుడు శాంతనూ అనే మరోకరితో రిలేషన్ షిప్ లో ఉంది. 35 ఏళ్ల శ్రుతీ హాసన్(Shruthi Hasan)  పెళ్లిపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వడంలేదు.

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి పోయింది హీరోయిన్  తాప్సి(Tapsee). ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. 34  ఏళ్ళ తాప్సీ కూడా ఇప్పటి వరకూ పెళ్ళి పీఠలు ఎక్కలేదు. ఆడవాళ్ళు భర్త కాళ్ళకిందకాదు.. స్వతంత్రంగా బ్రతకాలి అనే భావజాలంలో ఉండే తాప్సీ.. పురుష అధికారాన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు. కాకపోతే డెన్మార్క్ కు చెందిన బ్యాట్మెంటెన్ స్టార్ మాథురిస్ బో తో రిలేషన్ లో ఉంది తాప్సీ(Tapsee). తన మనసుకు.. తన ఆలోచనలకు తగ్గ వ్యాక్తితో ప్రేమలో ఉన్నట్టు హిట్లు కూడా ఇచ్చింది. కాకపోతే ఎవరైనా పెళి ఎప్పుడూ అని అడిగితే..? పెళ్ళి పక్కాగా చేసుకోవాలి అని రూల్  ఏమైనా ఉందా అంటూ.. పక్కాగా చెప్పేస్తుంది.

బాచిలర్ హీరోయిన్ల లిస్ట్ లో ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారు. మూడు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి పీఠలు ఎక్కని భ్యూటీస్ లిస్ట్ లో 33 ఏళ్లతో నిత్యా మేనన్ , 32 ఏళ్లతో  తమన్నా, 31 ఏళ్లతో  రకుల్ ప్రీత్ సింగ్ లాంటి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. మరికొంత మంది బాయ్ ఫ్రెండ్స్ ను సెట్ చేసుకుని..పెళ్లి ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొంత మంది హీరోయిన్లు మాత్రం  బ్యాచిలర్ లైఫ్ చాలా బెటర్ అంటూ సాగిపోతున్నారు.

click me!