Karthika deepam: మోనితకు చుక్కలు చూపిస్తున్న దీప.. వంటలక్క వంట కోసం డాక్టర్ బాబు తపన?

First Published Sep 2, 2022, 7:47 AM IST

Karthika deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెబర్ 2వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... దీప బట్టలు సర్దుకుని వాళ్ళ అన్నయ్య ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది.డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మ, రాంపండులు అందరూ బాధతో ఉన్నారు. ఇప్పుడు వెళ్లడం ఎందుకమ్మా?ఇక్కడి నుంచి కూడా నువ్వు అక్కడికి ప్రతి రోజూ వెళ్ళొచ్చు కదా ఇల్లు మారడం ఎందుకు అని అడగగా మొనిత చాలా తెలివైనది అని చెప్పాను కదా అమ్మ మళ్లీ నేను డాక్టర్ బాబుకి కనిపించానని చెప్పి ఊరు మారిపోతుందేమో అందుకే 24 గంటలు అక్కడే ఉండి డాక్టర్ బాబును చూసుకోవాలి. ఇప్పటివరకు డాక్టర్ బాబు కనిపించలేదని బాధపడ్డాను. ఇప్పుడు నా కళ్ళముందే ఉంటారు కదా చేసుకుంటాను అని అంటుంది.
 

అప్పుడు రాంపండులు ముఖం దీనంగా పెడతారు. ఏమైంది రాంపండు అలా పెట్టారు అని అడగగా నీ వంటని మిస్ అవుతాం అని అంటారు. అప్పుడప్పుడు మీకు కూడా భోజనం పంపిస్తాను మీరేం బాధపడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది దీప. ఆ తర్వాత సీన్లో సౌందర్య హిమకి పుట్టినరోజు వస్తుంది కదా బట్టలు కొనుక్కోమని అంటుంది. నాకు వద్దు నానమ్మ అని అంటుంది హిమ. అప్పుడు సౌందర్య, ప్రతి సంవత్సరం నాలుగు రోజుల ముందే బట్టలు కావాలి, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి అంటావు కదా ఈ సంవత్సరం ఏమైంది అని అంటుంది. అప్పుడు హిమ, ఈ సంవత్సరం నాకు ఇవేవీ వద్దు నానమ్మ అనాధ శరణాయానికి వెళ్లి డబ్బులు ఇచ్చేసి వారికి భోజనం పెడదామని అంటుంది.
 

మంచి ఆలోచన కానీ బట్టలు కొనుక్కోవడం ఆపేయడం ఎందుకు ఇది చేద్దాం అది చేద్దాం అని సౌందర్య అనగా వద్దు నానమ్మ నేనిప్పుడు ఇలా పండగ చేసుకుంటే అక్కడ శౌర్య ఒక్కతే ఉంటుంది కదా శౌర్య బాధపడుతుంది. అయినా శౌర్య,ఇంట్లో నేను ఉంటే రాదన్నది కాని నేను లేకపోతే వస్తాది కదా. సౌర్య ని ఇంటికి తెప్పించేయండి నానమ్మ నేను వెళ్ళిపోతాను అని అనగా సౌందర్య కోపంగా మాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటివారు. అలాగని నువ్వు వెళ్లిపోవడం లాంటి ఆలోచనలు వస్తే పళ్ళు రాలుతాయి. ఎప్పటికైనా శౌర్యం మన ఇంటికి రావాలే తప్ప నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని సౌందర్య అంటుంది.
 

ఆ తర్వాత సీన్లో కార్తీక్ శివ తో మాట్లాడుతూ ఏమైనా వంట మనిషిని తెలిస్తే మాట్లాడవయ్యా అని అంటాడు. ఇంతలో వాళ్ళకి ఒక బిర్యానీ వాసన వస్తుంది.వాసన  చాలా బాగుంది అని మొనిత దగ్గరికి వెళ్తాడు కార్తీక్.మొనిత కూడా,అవును కార్తీక్ వాసన చాలా బాగుంది ఆవిడని మనం వంట మనిషిగా పెట్టుకుందాము అని అంటుంది. ఎవరు ఆవిడని వెళ్లి చూసేసరికి ఆ పక్కింట్లో దీప వంట చేస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని మొనిత  అడుగుతుంది.అప్పుడు కార్తీక్, మీరా! నాకు మీరు గుర్తున్నారు. మామూలుగా నేను ఎవరిని గుర్తుపట్టలేను కానీ మీరు మాత్రం నాకు బాగా గుర్తున్నారు.
 

మీరు నన్ను ఇంకొకరు లాగా తప్పుగా అనుకున్నారు కదా అని అనగా మీరు డాక్టర్ బాబు కాదండి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అని దీప ఉంటుంది. అప్పుడు మొనిత మనసులో ఇదేదో కొత్త ప్లాన్ తోనే వచ్చినట్టు ఉన్నది ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాది. అప్పుడు కార్తీక్ మీరు మాకు వంట మనిషిగా ఉంటారా మా ఇంటికి వస్తారా అని అడగగా మొనిత వద్దు ఇంకా చాలామంది ఉంటారు కదా ఈవిడ ఎందుకు అని కార్తీక్ కి చెప్తుంది. అప్పుడు కార్తీక్ ఇందాకే అన్నావు కదా ఈవిడ నీ తెచ్చుకుందాం అని అంటాడు. దానికి దీప వద్దు నేను మీకు వంట మనిషిగా రాలేను కావాలంటే అప్పుడప్పుడు మీకు భోజనం పంపిస్తాను అని అంటుంది. పిలిచినా ఇంటికి రావట్లేదు అంటే ఏ పెద్ద ప్లాన్ వేసిందో అని అనుకుంటుంది మొనిత.
 

అప్పుడు కార్తీక్, సరే అయితే ఈరోజు వాసనలు బాగుందా ఈరోజు నుంచి మొదలుపెడదాము అని కార్తీక్ అంటాడు. ఇంతకీ మీ పేరేంటి కార్తీక్ అనగా నా పేరు దీప. దీపా అనే పిలవండి అలాగే నాకు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సౌందర్య గారు నన్ను కోడలా అని అంటారు. హిమ వంటలక్క అంటుంది, సార్య అమ్మ అంటుంది. అని అనగా ఎక్కడ కార్తీక్ కి గతం గుర్తొచ్చేస్తుందేమో అని మొనిత కార్తీక్ ని రా కార్తిక్ బోటిక్ లో చిన్న పని ఉన్నది అని తీసుకెళ్లి పోతుంది.ఆ తర్వాత కార్తీక్ బోటిక్ కి వచ్చి ఆ పేర్లు గురించి ఆలోచించుకుంటూ ఏంటి అన్ని పేర్లు ఉన్నాయి అని అనుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!