జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ అందించగా.. వంశీధర్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. యువ నటుడు శ్రీకాంత్ రెడ్డి, యంగ్ బ్యూటీ సంచిత బసు జంటగా నటించారు. జాతిరత్నాలు తరహాలోనే నవ్వించే సినిమా అవుతుందని అంచనాలు ఉన్నాయి. నేడు బాక్సాఫీస్ వద్దకు చిన్న చిత్రాలన్నీ క్యూ కడుతున్న వేళ.. ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా వచ్చేసింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.