మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు.`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయాడు. `ఉప్పెన`.. ఉప్పెనలాంటి హిట్‌నివ్వడంతో అటు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు ఇలా అంతా స్టార్లయిపోయారు. `ఉప్పెన` తర్వాత వైష్ణవ్ తేజ్ `కొండపొలం` చిత్రంలో నటించారు. సీరియస్‌గా సాగే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. దీనికి క్రిష్ దర్శకత్వం వహించడం గమనార్హం.
కెరీర్ ప్రారంభంలోనే ఓ హిట్, ఓ ఫెయిల్యూర్ చూశాడు వైష్ణవ్ తేజ్. ఈ రెండు చాలా అనుభవాలనిచ్చాయని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన `రంగరంగ వైభవంగా` అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంతో వస్తున్నారు. `అర్జున్ రెడ్డి`ని తమిళంలో రీమేక్ చేసిన దర్శకుడు గిరీశయ్య తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన తొలి చిత్రమిది. ఆయన సందీప్ రెడ్డి వంగా వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. `రంగరంగ వైభవంగా`లో బోల్డ్ బ్యూటీ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 2)న విడుదలవుతుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, మెగా ఫ్యామిలీ హీరో నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ పడగా, సినిమా గురింటి నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. ఆ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
ట్విట్టర్ టాక్ ప్రకారం సినిమాకి మిక్స్ డ్ టాక్ వస్తోంది. రెగ్యూలర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అంటున్నారు సినిమా చూసిన నెటిజన్లు. అయితే సినిమా క్లీన్ లవ్ స్టోరీతో సాగుతుందట. మధ్య మధ్యలో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. కాకపోతే ముందుగానే ఊహించేలా స్టోరీ సాగుతుందని చెబుతున్నారు. అదే సినిమాకి మైనస్ అంటున్నారు.
అయితే సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి నచ్చుతుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ కొత్త సీసాలో పాత సార అనేట్టు ఉంటుందట. రొటీన్ ఫ్యామిలీ డ్రామా, గొడవలు కొంత ఆకట్టుకుంటే, కొంత విసుగు పుట్టిస్తాయని చెబుతున్నారు. సెకండాఫ్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్ష పెడుతుందట. సెకండాఫ్‌తో పోల్చితే మొదటి భాగమే బెటర్ అని అంటున్నారు. ఓవరాల్‌గా సినిమా చూడాలంటే టార్చర్ భరించాల్సిందే అని అంటున్నారు.
అయితే సెంటిమెంట్స్ ఆర్టిఫిషయల్‌గా ఉన్నాయని,ఎక్కడా పండలేదనే టాక్ వినిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం ఓల్డ్ ఫార్ములాలో సాగుతుందట, అదిపెద్ద తలనొప్పి వ్యవహారం అంటున్నారు. మెడికల్ క్యాంప్ సీన్స్ లో కామెడీని పండించడానికి దర్వకుడు చాలా ప్రయత్నించాడని, కానీ సక్సెస్ కాలేకపోయాడని చెబుతున్నారు నెటిజన్లు.
కాస్టింగ్ సినిమా అసెట్ అని, వైష్ణవ్ తేజ్, కేతిక, ఇతర తారాగణం చాలా బాగా చేశారని, రొటీన్ స్టోరీని కూడా తమ నటనతో రక్తికట్టించారని అంటున్నారు. రిషిగా వైష్ణవ్ తేజ్, రాధాగా కేతిక శర్మ కనిపిస్తారట. ఇద్దరి మధ్య వచ్చే ఈగో సన్నివేశాలు ఫర్వాలేదనే టాక్ వినిపిస్తుంది. పాటలు సినిమాకి ప్లస్ అయ్యాయట. అవే కాస్త రిలీఫ్ అని అంటున్నారు. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కి మంచి మార్కులు పడుతున్నాయి. విజువల్ ప్లజెంట్‌గా ఉందని చెబుతున్నారు.
ఓవరాల్‌గా `రంగ రంగ వైభవంగా` మూవీకి నెగటివ్ టాక్ వస్తుంది. ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా, అంతిమంగా సినిమా చూసిన బయటకు వచ్చే ఆడియెన్స్ చివర్లో హ్యాపీగా ఫీలవ్వాలి. కానీ ఈ చిత్రంలో అది లోపించిందని, క్లైమాక్స్ తలనొప్పిగా ఉందని, దీంతో సినిమా రిజల్ట్ తేడా కొట్టేలా ఉందని ట్విట్టర్ టాక్ ద్వారా తెలుస్తుంది. మరి నిజంగానే సినిమా బాగా లేదా? బాగుందా? అనేది తెలియాలంటే `ఏషియానెట్ రివ్యూ` కోసం వేచి ఉండండి.