కర్మ వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది.. ఐశ్వర్యతో ధనుష్‌ విడాకుల నేపథ్యంలో నయనతార పోస్ట్ సంచలనం ?

First Published | Nov 29, 2024, 2:31 PM IST

హీరో ధనుష్‌ తన భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయనతార పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.  

నయనతార vs ధనుష్

హీరో ధనుష్‌, హీరోయిన్‌ నయనతార మధ్య ఘర్షణే ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. `నానుమ్‌ రౌడీ దాన్` సినిమా షూటింగ్ సమయంలో ఆ మూవీ బడ్జెట్ పెరగడానికి కారణమైనందున ఆ సినిమా నిర్మాత ధనుష్ కి, నటి నయనతార కి మధ్య ఘర్షణ జరిగిన విసయం తెలిసిందే.  ఆ సమస్య 10 సంవత్సరాల తర్వాత మళ్లీ బయటపడింది. నయనతార తన డాక్యుమెంటరీలో `నానుమ్ రౌడీ దాన్` సినిమా పాటను ఉపయోగించుకోవడానికి ధనుష్‌ అంగీకరించలేదు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ధనుష్ తో నయనతార ఘర్షణ

ఇంతలో ఆ డాక్యుమెంటరీలో  `నానుమ్‌ రౌడీ దాన్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన కొన్ని దృశ్యాలను ఉపయోగించడం చూసిన ధనుష్, దానికి హక్కులు తనవేనని నోటీసు పంపి, వాటిని తొలగించకపోతే 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని హెచ్చరించాడు.

దీనికి ధనుష్ పై విరుచుకుపడుతూ మూడు పేజీల ప్రకటన విడుదల చేసింది నయనతార. అంతేకాకుండా ధనుష్ హెచ్చరికను లెక్కచేయకుండా `నానుమ్ రౌడీ దాన్` సినిమా మేకింగ్ దృశ్యాలను తన డాక్యుమెంటరీలో చేర్చింది.


నయనతార వివాదం

నయనతార ప్రకటనకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఉన్న దనుష్, ఈ విషయంపై ఆమెపై చెన్నై హైకోర్టులో కేసు వేశాడు. అనుమతి లేకుండా `నానుమ్‌ రౌడీ దాన్` సినిమా దృశ్యాలను ఉపయోగించిన నయనతార, విఘ్నేష్ శివన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు ధనుష్. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి నయనతారను సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

నయనతార ఇన్‌స్టా స్టోరీ

ధనుష్ తనపై కేసు వేయడంతో ఆయనను పరోక్షంగా టార్గెట్ చేస్తూ తన ఇన్‌స్టా పేజీలో స్టోరీ పోస్ట్ చేసింది. అందులో “మీరు అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, దానిని అప్పుగా తీసుకోబడుతుంది. అది మీకు వడ్డీతో తిరిగి ఇస్తుంది” అని కర్మ చెప్పినట్లుగా పేర్కొని,

దానికి అండర్‌లైన్ కూడా చేసింది నయనతార. ఆమె ఈ పోస్ట్ ను నేరుగా ధనుష్‌ ని ఉద్దేశించి పెట్టకపోయినా, అది ధనుష్‌పై సెటైర్లే అని నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. 

ధనుష్‌ పై నయనతార సెటైర్లు

ఎందుకంటే హీరో దనుష్ కు కొద్ది రోజుల క్రితమే విడాకులు వచ్చాయి. 2004లో రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్, 2022లో ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీని తర్వాత రెండేళ్లుగా వీరిద్దరి విడాకుల కేసు నడుస్తుండగా, కొద్ది రోజుల క్రితం ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది కోర్టు. దీన్ని విమర్శిస్తూనే నయనతార ఇన్‌స్టాలో సూచన ప్రాయమైన పోస్ట్ పెట్టిందని చెబుతున్నారు. మరి నయనతార ఏ ఉద్దేశ్యంతో పెట్టిందోగానీ దీన్ని ధనుష్‌కి లింక్‌ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. 

read more: బిజినెస్‌లో ఆరితేరిన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ క్రేజ్‌ని వాడకంలో ఇది నెక్ట్స్ లెవల్‌

also read:తాత ఏఎన్నార్‌ రొమాన్స్ ముందు నాగ్‌ మామ సరిపోడు.. చివరి రోజుల్లో ఆసుపత్రిలో నర్స్ తో కూడా

Latest Videos

click me!