బిజినెస్‌లో ఆరితేరిన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ క్రేజ్‌ని వాడకంలో ఇది నెక్ట్స్ లెవల్‌

Published : Nov 29, 2024, 02:05 PM IST

హీరోగానే కాదు, బిజినెస్‌లోనూ దూసుకుపోతున్నారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన బన్నీని గట్టిగా వాడేసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌లో ఉంది.   

PREV
15
బిజినెస్‌లో ఆరితేరిన విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌ క్రేజ్‌ని వాడకంలో ఇది నెక్ట్స్ లెవల్‌

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు భారీ సినిమాలతో రాబోతున్నాడు. ఆయన చేతిలో మూడు భారీ చిత్రాలున్నాయి. అందులో ఒకటి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతుంది. `వీడీ 12` పేరుతో ఈ మూవీ రూపొందుతుంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ కొంత గ్యాప్‌తో తన నెక్ట్స్ సినిమాకి షిఫ్ట్ అవుతాడు. జనవరి తర్వాత కొత్త సినిమా స్టార్ట్ కానుందని తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ఇక విజయ్‌ దేవరకొండ హీరోగానే కాడు బిజినెస్‌ మేన్‌గా కూడా రాణిస్తున్నాడు. ఆయన దుస్తుల బిజినెస్‌ని ప్రారంభించిన విషయం తెలిసిందే. `రౌడీ వేర్‌` పేరుతో మెన్స్ వేర్‌ని అందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా  టీషర్ట్స్ ఉంటాయి. తనకు `రౌడీ బాయ్‌` అనే క్రేజ్‌ వచ్చినప్పట్నుంచి ఈ వ్యాపారం స్టార్ట్ చేశాడు విజయ్. ఇది నెమ్మదిగా పుంజుకుని ఇప్పుడు విజయవంతంగా రన్‌ అవుతుంది. రౌడీ బ్రాండ్ బాగా విస్తరించింది.  

35

ఇదిలా ఉంటే తన బ్రాండ్‌ని విస్తరించే క్రమంలో, సేల్స్ ని పెంచేందుకు అద్భుతమైన ప్లాన్‌ చేశాడు విజయ్‌. అల్లు అర్జున్‌ క్రేజ్‌ని వాడుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ మామూలుగా లేదు. ఆయన హీరోగా నటించిన `పుష్ప 2` సినిమా మరో వారంలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా `పుష్ప 2` మేనియా నడుస్తుంది. సోషల్‌ మీడియా మొత్తం `పుష్ప` ట్రెండింగ్‌లో ఉంటుంది. దీంతో ఈ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు విజయ్‌. ఐకాన్‌ స్టార్‌ ని సర్‌ప్రైజ్‌ చేశాడు. 
 

45

పుష్ప పేరుతోనే రౌడీ బ్రాండ్‌ని క్రియేట్‌ చేశాడు. `రౌడీ పుష్ప` అంటూ సరికొత్తగా దుస్తులు తయారు చేయించాడు. టీషర్ట్స్ పై `రౌడీ పుష్ప` అని ప్రింట్‌ చేయించాడు. దీన్ని అల్లు అర్జున్‌కి గిఫ్ట్ గా పంపించాడు. ఈ విషయాన్ని బన్నీ వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండకి థ్యాంక్స్ చెప్పాడు బన్నీ. మై స్వీటెస్ట్ బ్రదర్‌, విజయ్‌ దేవరకొండ ఈ ప్రేమకి ధన్యవాదాలు అని పేర్కొన్నాడు అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌ అవుతుంది. ఇందులో రౌడీ పుష్ప పేరుతో టీషర్ట్స్ ఉన్నాయి. 

55
Pushpa 2

ఈ దెబ్బకితో రౌడీ వేర్స్ సేల్స్ అమాంతం పెరిగిపోతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ వారం పది రోజులు పుష్ప హవా నడుస్తుంది. దీంతో రౌడీ పుష్ప సేల్స్ కూడా అమాంతం పేరుగుతాయని చెప్పొచ్చు. అయితే విజయ్‌ ఇది బన్నీపై ప్రేమతోనే చేయించినా, అది బిజినెస్‌ పరంగానూ హెల్ప్ కావడం విశేషం. ప్రస్తుతం విజయ్‌ తెలివికి హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు నెటిజన్లు.

అటు బన్నీ ఫ్యాన్స్ విజయ్‌కి థ్యాంక్స్ చెబుతుండగా, రౌడీ ఫ్యాన్స్ బన్నీకి విషెస్‌ తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప 2` డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. సుకుమార్‌ రూపొందించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. శ్రీలీల ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. 

read more: అత్యంత నిడివి గల సినిమాలు

also read: తాత ఏఎన్నార్‌ రొమాన్స్ ముందు నాగ్‌ మామ సరిపోడు.. చివరి రోజుల్లో ఆసుపత్రిలో నర్స్ తో కూడా

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories