ఫస్ట్ పార్ట్ లో పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్, పుష్ప మధ్య ఇగో క్లాస్ వస్తుంది. ఇగో సమస్యలు తీవ్ర వైరంగా మారుతాయి. పుష్ప 2 చిత్ర కథ షెకావత్, పుష్ప రాజ్ మధ్య పోరాటం మాత్రమే అనుకునే పొరపాటు. షెకావత్ తరహాలోనే మరో వ్యక్తికి కూడా ఇగో క్లాష్ మొదలవుతుంది. ఎర్రచందనం సిండికేట్ కి పుష్పరాజ్ సామ్రాట్ అవుతాడు. అందనంత ఎత్తుకుకి ఎదుగుతాడు. చివరికి సీఎం తో కూడా పుష్పరాజ్ కి పరిచయాలు ఏర్పడతాయి.