పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నుంచి ఒక ఆసక్తికర అప్డేట్ వచ్చింది. త్వరలో భారీ ప్రకటన ఉండబోతున్నట్లు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సమురాయ్ యోధులకు సంబంధించిన మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. హరి హర వీరమల్లు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఓజీ మాత్రం సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది.
25
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో
మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో ప్రారంభించిన తన ప్రొడక్షన్ హౌస్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని తిరిగి యాక్టివ్ చేశారు.
35
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్
మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ తో ప్రస్తుతం అభిమానుల ని ఊరిస్తున్నారు. తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలో భారీ ప్రకటన రాబోతోంది అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఒక వీడియో రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో కరాటే యోధుడు టు సమురాయ్ అని రాసి ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కటానా కత్తిని ఉపయోగిస్తున్నారు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ నే అని అభిమానులు భావిస్తున్నారు. జాపనీస్ భాషలో కూడా కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. సమురాయ్ ల గురించి ప్రస్తావన ఓజీ చిత్రంలో ఉంది.
55
ఓజీ 2 ప్రకటన ?
ఈ వీడియోలో కరాటే యోధుడు టు సమురాయ్ అని ఉండడంతో ఇది ఓజీ 2 కి సంబంధించిన ప్రకటన గురించే అని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఓజీ 2 ఉండబోతోందా అనే అంచనాలు అభిమానుల లో పెరుగుతున్నాయి.