ప్రభాస్ వర్సెస్ దళపతి విజయ్... 2026 ఫస్ట్ బిగ్ బాక్సాఫీస్ క్లాష్ లో సక్సెస్ ఎవరిది?

Published : Jan 07, 2026, 05:14 PM IST

Prabhas vs Thalapathy Vijay : 2026లో మొదటి అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్ జనవరి 9న జరగబోతోంది. ఆ రోజు సౌత్ సూపర్ స్టార్లు విజయ్, ప్రభాస్ సినిమాలు ' ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలలో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటే సినిమా ఏది? 

PREV
17
ప్రభాస్ వర్సెస్ దళపతి విజయ్..

సౌత్ సూపర్ స్టార్లు దళపతి విజయ్, ప్రభాస్ మధ్య జనవరి 9న బాక్సాఫీస్ వద్ద భారీ వార్  జరగనుంది. ప్రస్తుతం 'జన నాయగన్', 'ది రాజా సాబ్' సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే, ఎవరు పైచేయి సాధిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

27
జన నాయకుడు బడ్జెట్..

దళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమా 'జన నాయకుడు' జనవరి 9న రిలీజ్ అవుతోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న  ఈ యాక్షన్ థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా బడ్జెట్ 300 కోట్లు  పైనే అని సమాచారం. అయితే ఇందులో విజయ్ దళపతి రెమ్యునరేషన్ కే 250 కోట్లు ఇచ్చినట్టు  చెబుతున్నారు.

37
విజయ్ సినిమాపై విపరీతమైన క్రేజ్..

విజయ్ 'జన నాయకుడు' సినిమాపై మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. విజయ్ కు ఇది  చివరి సినిమా కావడమే దీనికి ప్రధాన కారణం. ఆ తర్వాత అభిమానులకు విజయ్ ని స్క్రీన్‌పై కనిపించరు. దాంతో విజయ్ సినిమాను తనివితీరా చూసుకోవడం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాలో విజయ్ తో పాటు  పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. 

47
అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న సినిమా..

'జన నాయగన్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదరగొడుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే 35 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో బ్లాక్డ్ సీట్లతో 10.30 కోట్లు సంపాదించింది. రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈమూవీ తమిళ ఇండస్ట్రీలో మొదటి 1000 కోట్ల కలెక్షన్ రికార్డు సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు. 

57
రాజాసాబ్ కోసం పాన్ ఇండియా వెయిటింగ్

 మారుతి డైరెక్షన్ లో .. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమా 'ది రాజా సాబ్'.  ఈ సినిమా కూడా జనవరి 9నే రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్ లో  క్రేజ్ ఉంది. విజయ్ క్రేజ్ తమిలనాడు వరకే ఉంటే.. ప్రభాస్ క్రేజ్ దేశమంతా ఉంది. ఈసినిమా దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్ట సమాచారం.  

67
ది రాజా సాబ్' హారర్ కామెడీ మూవీ

ప్రభాస్ 'ది రాజా సాబ్' ఒక హారర్ కామెడీ సినిమా. దీని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఓవర్సీస్ మార్కెట్లో 9 కోట్లు, ఇండియాలో 5 కోట్లు వసూలు చేసింది. ఇది 'జన నాయగన్' వసూళ్లలో సగం. ఈసినిమాలో ప్రభాస్ తో పాటు  మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, జరీనా వహాబ్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. 

77
ఏ సినిమా సత్తా చాటుతుంది..?

అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే, విజయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా సత్తా చాటుతుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రభాస్ 'ది రాజా సాబ్'పై క్రేజ్ ఉన్నా.. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో నిదానంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా సత్తా ఎంతో?

Read more Photos on
click me!

Recommended Stories