500 కోట్లు వసూలు చేసిన సినిమా బడ్జెట్ కేవలం 14 కోట్లు, 3 ఏళ్లుగా ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తోన్న మూవీ

Published : Sep 05, 2025, 01:22 PM IST

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. తక్కువ బడ్డెట్ తో తీసిన, కంటెంట్ ఏంటే చాలు, బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అలాంటి సినిమా గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మూడేళ్లుగా ఓటీటీని ఏలుతున్న ఆమూవీ ఏదంటే?

PREV
15

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది ఓ చిన్న సినిమా. ఊహించని స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకొని, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. ఆ సినిమా మరేదో కాదు ‘కాంతార’. 2022లో విడుదలైన ఈ కన్నడ చిత్రం, దేశ వ్యాప్తంగా అద్భుతం చేసింది.

25

కేవలం 14 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘కాంతార’, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. ఈ సినిమా థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా రచ్చ రచ్చ చేస్తోంది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అయిన కాంతారా గత మూడు సంవత్సరాలుగా ట్రెండ్ అవుతోంది. దీనివల్ల ఇది ఓటీటీ హిస్టరీలో మైలురాయిగా నిలిచింది.

35

కాంతార సినిమాతో హీరో కమ్ డైరెక్టర్ గా రిషబ్ శెట్టికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్, చలువే గౌడ ఈ సినిమాను నిర్మించారు. కథలోని దేవతా సంప్రదాయాలను, భక్తి , ప్రకృతి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యేకమైన తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

45

కాంతార 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి అవార్డు పొందగా, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా మరో అవార్డు లభించింది.ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. అయితే ఇది సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. అంటే ‘కాంతార’ కథకు ముందు ఏం జరిగింది అనేది సినిమాగా తీసుకురాబోతున్నారు రుషబ్ శెట్టి.

55

ఈ సినిమా వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. కాంతార ప్రీక్వెల్ ను అక్టోబర్ 2, 2025న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు టీమ్. ఇందులో ‘దైవిక సంప్రదాయం ఎలా ప్రారంభమైంది?’ అనే అంశాన్ని వివరించనున్నారు. ఈ ప్రీక్వెల్‌లో కూడా రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అతనితో పాటు సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories