అలా బస్సులు మారుతున్న సమయంలో ఓ అబ్బాయి ప్రతిరోజూ ఆమె బస్ స్టాప్ వద్ద ఎదురుచూస్తూ స్కూల్ వరకు ఫాలో అయ్యేవాడట. రెండు సంవత్సరాల పాటు అతను సమంతను ఫాలో అయ్యాడట. కాని ఏమీ మాట్లాడలేదట. ఇక ఇలా కుదరదు అని సమంత స్వయంగా ఒకసారి ధైర్యం చేసి అతని వద్దకు వెళ్లి, “నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావ్?” అని ప్రశ్నించగా, “నేను నిన్ను ఫాలో కావడం ఏంటీ?” అని ఆశ్చర్యంగా చెప్పాడట. ఇది ప్రేమా కాదో తనకూ అర్థం కాలేదని, కానీ ఇదే తన ఫస్ట్ లవ్ అని సమంత చెప్పారు. ఆమె మాటల్లో చూస్తే, సమంత కూడా అతనిపై కొంత ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. కానీ ఆ అబ్బాయి ధైర్యం చేయకపోవడం వల్ల ఆ ప్రేమ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది.