బాక్సాఫీస్ పై కాంతార 1 దండయాత్ర, ఫస్ట్ డే కలెక్షన్లు? 100 కోట్లకు చేరువలో రిషబ్ శెట్టి సినిమా

Published : Oct 03, 2025, 09:34 AM IST

Kantara Chapter 1 First Day  Collections : రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన కాంతార చాప్టర్ 1 సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించింది. ఈసినిమా ఫస్ట్ డే  కలెక్షన్ల వివరాలు చూద్దాం.

PREV
14
బాక్సాఫీస్ పై కాంతార 1 దండయాత్ర

దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కాంతార చాప్టర్ 1' నిన్న(02 అక్టోబర్)  విడుదలైంది. 2022లో వచ్చిన 'కాంతార' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఆ సినిమా విజయంతో, దానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. ఇందులో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

24
6500 స్క్రీన్లలో భారీ రిలీజ్

ఇండియా  మొత్తం 6500 స్క్రీన్లలో 12,511కి పైగా షోలతో కాంతార చాప్టర్ 1 ప్రదర్శితమైంది. ఇక విదేశాల్లో, ఒక్క అమెరికాలోనే ఈ సినిమా .4.20 కోట్లు వసూలు చేసింది. 30 దేశాల్లో విడుదలైన ఈ సినిమా తొలిరోజు విదేశీ వసూళ్లు 10 కోట్లుగా అంచనా. బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రానికి ఇప్పటివరకు 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. గురువారం గంటకు 60,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

34
బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు

కాంతార చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు వెలువడ్డాయి. ఈ సినిమా తొలిరోజే భారత్‌లో 60 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇందులో హిందీ వెర్షన్ రూ.19.5 కోట్లు, కన్నడ వెర్షన్ రూ.18 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.12.5 కోట్లు, తమిళ వెర్షన్ రూ.5.25 కోట్లు, మలయాళ వెర్షన్ రూ.4.75 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.70 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

44
100 కోట్లకు చేరువలో

2022లో విడుదలైన కాంతార మొదటి భాగం తొలిరోజు కేవలం రూ.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కానీ దాని రెండో భాగం ఇప్పుడు 10 రెట్లు అధికంగా వసూలు చేసి సత్తా చాటింది. కాంతార చాప్టర్ 1కి పాజిటివ్ రివ్యూలు రావడంతో, ఈ సినిమా కలెక్షన్లలో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈరోజు కాంతార 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటుతుంది. ఇక  ఈ ఏడాది రూ.1000 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా కాంతార చాప్టర్ 1 నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంతకు ముందు కన్నడ సినీ పరిశ్రమలో రూ.1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది. 

Read more Photos on
click me!

Recommended Stories