ఈసినిమాకు నెగెటీవ్ టాక్ కూడా ఎక్కువగానే ఉంది. ట్విట్టర్ లో మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ మాత్రం ఆగడంలేదు. ఈసినిమా బోరింగ్, ప్రభాస్ రావడం వల్లే ఈమూవీ కాస్త హైలెట్ అయ్యిందంటూ ట్వీట్ చేసినవారు కూడా ఉన్నారు. అంతే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు సెట్ అవ్వలేదు, సినిమా వీఎఫ్ ఎక్స్ క్వాలిటీ అస్సలు బాలేదు, లొకేషన్లు అస్సలు సెట్ అవ్వలేదు అంటూ విమర్శిస్తున్నారు.
ఇక కొంత మంది అయితే డైరెక్ట్ గా ట్రోలింగ్ మొదలు పెట్టారు. మంచు విష్ణు నటన మీద, డైలాగ్స్ మీద సెటైర్లు వేస్తున్నారు. రకరకాలుగా విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం విష్ణు సాహసాన్ని అభినందించారు. ఇక ఈసినిమా వల్ల మంచు విష్ణు మీద గౌరవం పెరిగిందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా కన్నప్ప సినిమాపై ఆడియన్స్ సోషల్ మీడియాలో రకరకాల రివ్వ్యూస్ ఇస్తున్నారు.