కన్నప్ప సినిమాకు అరుదైన గౌరవం, రాష్ట్రపతి భవన్ లో మంచు విష్ణు డ్రీమ్ మూవీ స్క్రీనింగ్

Published : Jul 18, 2025, 01:16 AM ISTUpdated : Jul 18, 2025, 01:17 AM IST

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుతమైన స్పందన రాబట్టింది. ఈక్రమంలో కన్నప్పకు అరుదైన గౌరవం లభించింది. ఈసినిమాను రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.

PREV
16

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిన చారిత్రక ఇతిహాస చిత్రం ‘కన్నప్ప. ఈ సినిమాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రీసెంట్ గా న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ స్పెషల్ స్క్రీనింగ్‌కు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. భక్త కన్నప్ప జీవితగాథను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా అక్కడివారిని ఎంతగానో ఆకట్టుకున్నట్టు సమాచారం.

26

మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ముఖ్యంగా చివరి 40 నిమిషాల సినిమాకు వారు ఎమెషనల్ గా కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాలో విజువల్స్, నేపథ్య సంగీతం ఈసినిమాపై శాశ్వత ముద్ర వేసిందని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం.

36

విష్ణు మంచు ఈ సినిమాలో తన నటనతో అద్భుతం చేశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలో లీనమైన విధానం దేశవ్యాప్తంగా అందరిని ఆకట్టుకుంది. రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేక ప్రదర్శన అనంతరం పలువురు సీనియర్ అధికారులు, విమర్శకులు, సినీ ప్రముఖులు విష్ణు నటనపై ప్రశంసలు కురిపించారు. తెలుగు సినిమా రేంజ్‌ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమాల్లో కన్నప్ప కూడా చేరిందని వారు అన్నట్టు తెలుస్తోంది.

46

ఇక కన్నప్ప కథ విషయానికి వస్తే ‘తిన్నడు’ అనే వేటగాడు నాస్తికుడిగా జీవితం గడుపుతుంటాడు. దేవునిపై నమ్మకం ఉండదు. కాని కాల క్రమంలో కొన్ని సంఘటనల వల్ల అతనిలో మార్పు వస్తుంది. నాస్తికుడిగా ఉన్న తిన్నడు తన జీవిత ప్రయాణంలో శివభక్తుడిగా ఎలా మారుతాడన్న అంశమే ప్రధానంగా తీసుకుని ఈసినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ రుద్ర పాత్రలో, మోహన్ లాల్ కిరాత పాత్రలో, అక్షయ్ కుమార్ శివునిగా నటించి మెప్పించారు.

56

అంతే కాదు వీరితో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు లాంటి స్టార్ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. భక్తి రస సినిమాకు విజ్యువల్ ఎఫెక్ట్స్ ను జోడించి అద్భుతమైన సినిమాను ఆవిష్కరించారు మూవీ టీమ్. ఈసినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. భారీ సెట్స్ తో పాటు, న్యూజిలాండ్ లో తీసిన సన్నివేశాలు ఆడియన్స్ కు గ్రాండ్ విజువల్ ట్రీట్‌ అందించాయి.

66

ఈసినిమా కోసం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ ను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ముందు నుంచి భారీ అంచనాల నడుమ ఈసినిమా రూపొందింది. బాలీవుడ్ లో మహాభారతం లాంటి భారీ సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాను డైరెక్ట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories