కింగ్ డమ్ రిలీజ్ ఎప్పుడంటే?
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈసినిమాపైనే విజయ్ దేవరకొండ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడింది. నెట్‌ఫ్లిక్స్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేయాల్సి వచ్చింది.ఇక ఈమూవీని జులై 31న రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసినిమా రిలీజ్ కు కొద్దిరోజులే ఉండటంతో, ప్రమోషన్ల వేగం పెంచాలి అనుకుంటున్న టైమ్ లో, విజయ్ దేవరకొండ ఆసుపత్రి పాలవ్వడం మూవీ టీమ్ ను ఆందోళనకు గురి చేస్తోంది.