`కుబేర`పై `కన్నప్ప` ఊహించని దెబ్బ.. నాగార్జున, ధనుష్‌ మూవీ నిర్మాతలకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

Published : Jun 29, 2025, 12:39 PM IST

ధనుష్‌, నాగార్జున నటించిన `కుబేర` మూవీ పడుతూ లేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు `కన్పప్ప` రూపంలో గట్టి దెబ్బ పడింది. భారీ నష్టాలను తీసుకురాబోతుందట. 

PREV
15
నాగార్జున, ధనుష్‌ల `కుబేర` కలెక్షన్ల రిపోర్ట్

నాగార్జున, ధనుష్‌ హీరోలుగా రష్మిక మందన్నా కథానాయికగా నటించిన `కుబేర` మూవీ గత వారం విడుదలైంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. 

కలెక్షన్లు కూడా డీసెంట్‌గానే ఉన్నాయి. ఈ మూవీ తొమ్మిది రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా కలెక్షన్‌ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎన్ని కోట్లు వచ్చాయి ఇందులో తెలుసుకుందాం. 

25
`కుబేర` 9 రోజుల కలెక్షన్లు

`కుబేర` మూవీ తొమ్మిది రోజుల్లో సుమారు రూ.110కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. (వాస్తవంగా ఇది వంద కోట్ల లోపే ఉందని టాక్). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల నెట్‌ సుమారు యాభై కోట్ల(రూ.50-55కోట్లు) వరకు ఉంటుందని అంచనా. 

ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ రూ.63కోట్లు. సుమారు రూ. 65కోట్లు నెట్‌ కలెక్షన్లు వస్తే బయ్యర్లు సేఫ్‌. ఇంకా పది కోట్లకుపైగానే నెట్‌ కలెక్షన్లు థియేట్రికల్‌గా రావాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

35
`కుబేర` నైజాం, ఓవర్సీస్‌లో సేఫ్‌, మిగతా అంతా లాస్‌

ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల ప్రకారం `కుబేర` మూవీకి నైజాంలో, ఓవర్సీస్‌లో బ్రేక్‌ ఈవెన్‌ అయినట్టు సమాచారం. నైజాంలో నిర్మాతలు సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌లకు సొంత థియేటర్లు ఉన్నాయి. దీంతో నైజాంలో వాళ్లు సేఫ్‌ అయ్యారు. 

ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రావడంతో అక్కడ కూడా సేఫ్‌ అయ్యారని సమాచారం. ఇక తమిళనాడు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ మూవీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. 

తమిళనాడులో ధనుష్‌ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. చాలా డల్‌గా అక్కడి కలెక్షన్లు ఉన్నాయి. ఇది ధనుష్‌తోపాటు కొన్న బయ్యర్లకి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. ఇక నార్త్ లో అమీర్‌ ఖాన్‌ `సితారే జమీన్‌ పర్‌` మూవీ దెబ్బ గట్టిగానే పడింది.

45
`కుబేర` కలెక్షన్లపై `కన్నప్ప` గట్టి దెబ్బ

ఇదిలా ఉంటే ఈ మూవీకి ఇప్పుడు మంచు విష్ణు `కన్నప్ప` రూపంలో మరో దెబ్బ పడింది. బేసిక్‌గా రిలీజ్‌కి ముందు `కన్నప్ప`పై ట్రేడ్‌ వర్గాల్లో పెద్దగా అంచనాలు లేవు. 

కానీ ఇప్పుడు పాజిటివ్‌ టాక్‌ రావడం, కలెక్షన్లు కూడా బాగా ఉండటం విశేషం. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌ ఇమేజ్‌ మూవీకి కలిసి వస్తోంది. కలెక్షన్లు పెరగడానికి హెల్ప్ అవుతుంది. 

ఇది `కుబేర`పై గట్టి దెబ్బ పడబోతుందని చెప్పొచ్చు. తెలుగులోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఎఫెక్ట్ `కుబేర`పై ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

55
`కుబేర` వల్ల నిర్మాతలకు ఎంత నష్టం అంటే ?

ఈ ప్రభావాలతో `కుబేర` మూవీ గట్టిగానే నష్టపోతుందని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు భారీగానే నష్టపోయే పరిస్థితి ఎదురయ్యిందని ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. 

`కుబేర` చిత్రానికి అయిన బడ్జెట్‌ రూ.130-140కోట్లు అని టాక్‌. ప్రమోషన్స్, ఇంట్రెస్ట్ అన్నీ కలుపుకుని. ఈ చిత్రానికి థియేట్రికల్‌గా రూ.63కోట్ల బిజినెస్‌ అయ్యింది. ఓటీటీ రూపంలో రూ. 47కోట్లు వచ్చాయి. 

శాటిలైట్‌, ఆడియో కలుపుకుని మరో ఐదు నుంచి పది కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం. అయితే థియేట్రికల్‌గానే ఈ చిత్రానికి రూ.5-10కోట్ల వరకు నష్టాలు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. 

దీనికితోడు మరో రూ.20కోట్లు నిర్మాతలు స్వయంగా నష్టపోతున్నారు. మొత్తంగా `కుబేర` సుమారు రూ20-30కోట్ల లాస్‌ ప్రాజెక్ట్ గా నిలవబోతుందని క్రిటిక్స్ అంచనా. ఇది గ్రహించే చిత్ర నిర్మాతలు సైలెంట్‌గా ఉన్నారని సమాచారం. కానీ ఇప్పటి వరకు దీన్ని హిట్‌ మూవీగా ప్రచారం చేసుకోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories