శోభా శెట్టిని మించిపోతుందా, బిగ్ బాస్ తెలుగు 9 లోకి గ్లామరస్ హీరోయిన్.. ఆమె నాగార్జునతో నటించింది తెలుసా

Published : Jul 25, 2025, 07:30 AM IST

బిగ్ బాస్ తెలుగు షోలో గత కొన్ని సీజన్లుగా కన్నడ నటీనటుల డామినేషన్ ఎక్కువైంది. సీజన్ 9లో మరో క్రేజీ కన్నడ బ్యూటీ కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

PREV
15
సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ తెలుగు 9 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 9వ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ షో నుంచి భారీగా లీకులు వస్తున్నాయి. సీజన్ 9లో సమూల మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ రొటీన్ టాస్కులు ప్రేక్షకులకు బోర్ కొట్టేస్తున్నాయి అనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.  

25
రొటీన్ గా మారిపోయిన బిగ్ బాస్ 

ఒకేరకంగా సాగే టాస్కులు, వీకెండ్ లో నాగార్జున ఒకే తరహాలో వ్యవహరించడం లాంటి వాటిని ప్రేక్షకులు గత కొన్ని సీజన్లుగా గమనిస్తూనే ఉన్నారు. దీనితో సీజన్ 9లో మార్పులు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా హౌస్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం మేరకు ఒక గ్లామరస్ బ్యూటీ బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

35
బిగ్ బాస్ తెలుగు 9లోకి కన్నడ బ్యూటీ ?

కన్నడ హీరోయిన్ కావ్య శెట్టి బిగ్ బాస్ తెలుగు 9కి కంటెస్టెంట్ గా ఎంపికైనట్లు టాక్. కన్నడలో కావ్య శెట్టి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో గుర్తుందా శీతాకాలం చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆమె తన గ్లామరస్ లుక్స్ లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. గతంలో కన్నడ బ్యూటీ శోభా శెట్టి బిగ్ బాస్ 7లో పాల్గొని రచ్చ రచ్చ చేసింది. 

45
శోభా శెట్టి లాగే కావ్య శెట్టి 

సీజన్ 7 లో శోభా శెట్టి తన గ్లామర్ లుక్స్ తో ఆకర్షించడమే కాదు హౌస్ లో ఒక రేంజ్ లో ఫైర్ బ్రాండ్ గా హంగామా చేసింది. ఇప్పుడు కావ్య శెట్టి కూడా అదే తరహాలో బిగ్ బాస్ షోలో హైలైట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. 

55
నాగార్జునతో నటించిన కావ్య శెట్టి 

కావ్య శెట్టి గురించి మరో ఆసక్తికర విషయం ఉంది. ఆమె గతంలో నాగార్జునతో నటించింది.. కానీ సినిమాలో కాదు. కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ లో నాగార్జునతో కలిసి కావ్య శెట్టి మెరిసింది. ఆ టైంలో నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలని కావ్య శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories