అయితే దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. `హరి హర వీరమల్లు` మూవీ సక్సెస్ మీట్‌ని గురువారం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లకి బాధ పడవద్దని, వాటిని లైట్ తీసుకోవాలని, మన గురించి విమర్శలు చేస్తున్నారంటే, మనం ఆ స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి, మన స్థాయి ఏంటో వాళ్లు మనకు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని గమనించాలని చెప్పారు.
అదే సమయంలో వాటిని పెద్దగా పట్టించుకోవద్దు అని చెప్పారు. తమ గురించి ఏదైనా కామెంట్ పెడితే అక్కడే ప్రతిస్పందించాలని, అలానే ఎదుర్కోవాలని తెలిపారు పవన్.
ఫ్యాన్స్ లో జోష్ నింపే కామెంట్స్ చేశారు. టాక్ విషయంలో ఎవరూ బాధపడొద్దని, జీవితాన్ని ఎంజాయ్ చేయాలి తెలిపారు పవన్. ఆయన కామెంట్స్ వైల్ అవుతున్నాయి.