హరిహర వీరమల్లు టార్గెట్ రీచ్ అయింది, బాయ్ కాట్ అని బెదిరిస్తే బెదిరిపోను.. నెగిటివిటీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

Published : Jul 24, 2025, 10:35 PM IST

మీరు బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదు. చేస్తే చేసుకోండి అంటూ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు ఊహించని విధంగా ఉన్నాయి. 

PREV
15
హరిహర వీరమల్లు చిత్రానికి ప్రేక్షకుల రియాక్షన్ 

హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం, నిధి అగర్వాల్ ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. గురువారం రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ బావుందని చెబుతున్న ప్రేక్షకులు, సెకండ్ హాఫ్ విషయంలో నిరాశ ఎదురైందని అంటున్నారు. 

25
హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ 

ఈ నేపథ్యంలో సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు చిత్రంపై ఉన్న నెగిటివిటీ పై పవన్ చేసిన ఫస్ట్ కామెంట్స్ ఊహించని విధంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు హరిహర వీరమల్లు చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. వైసీపీ అభిమానుల నుంచి ఈ చిత్రానికి ట్రోలింగ్ ఎదురైంది. దీనిపై పవన్ స్పందిస్తూ.. మీరు బాయ్ కాట్ అని బెదిరిస్తే బెదిరిపోను. నెల్లూరు వీధుల్లో మొదలైన నా ప్రయాణం ఇప్పుడు డిప్యూటీ సీఎం వరకు చేరుకుంది. మీరు బెదిరిస్తే బెదిరిపోతానా అని అన్నారు. 

35
బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదు 

బాయ్ కాట్ చేస్తే చేసుకోండి..దెబ్బలు తినే ఈ స్థాయికి వచ్చాను. మీరు బాయ్ కాట్ చేసినంత మాత్రాన ఏం తేడా ఉండదు అని పవన్ తెలిపారు. అభిమానులే నా బలం. మనం బలంగా ఉన్నాం కాబట్టే మనకి వ్యతిరేకంగా నెగిటివిటీ ఉంది. ఒక సినిమాని చూసి ఇంతలా భయపడి పోతున్నారంటే మన స్థాయి ఏంటో అర్థం అవుతోంది అని పవన్ అన్నారు. 

45
హరిహర వీరమల్లు టార్గెట్ రీచ్ అయింది 

హరిహర వీరమల్లు చిత్రంతో చెప్పాలనుకున్న విషయం టార్గెట్ రీచ్ అయింది. ఔరంగజేబు డార్క్ సైడ్ ని చూపించాలనుకున్నాం. అది బాగా రీచ్ అయింది. ఆ విషయంలో ఈ చిత్రం సక్సెస్. ఈ చిత్రంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని పార్ట్ 2లో రిపీట్ కానివ్వము అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే హరిహర వీరమల్లు 2 తప్పనిసరి ఉంటుందని హింట్ ఇచ్చారు. 

55
నెగిటివిటీని నలిపేయండి 

నా అభిమానులు అంత సున్నితంగా ఉండొద్దు. నెగిటివిటీని నలిపేయండి. అవతలి వాళ్ళు కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే ఊరుకోవద్డు అని పవన్ కళ్యాణ్ ఊహించని కామెంట్స్ చేశారు. 

Read more Photos on
click me!

Recommended Stories