ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. తనపై ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. సిక్కులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అనంతరం సోషల్ మీడియాలో ఓ వల్గర్ పోస్ట్ పెట్టడంతో కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. దీనితో కంగనా రనౌత్ పై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి.