టాలీవుడ్ క్రేజీ కపుల్స్ నాగచైతన్య, సమంత విడిపోవడం అభిమానులకు ఊహించని షాక్. చైతు, సమంత విడాకుల గురించి ఇప్పటికి అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఎలాంటి సందర్భం వచ్చినా నెటిజన్లు సమంత, నాగ చైతన్య గురించి చర్చించుకుంటున్నారు. నాలుగేళ్ళ పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించిన సమంత, చైతు.. తాము విడిపోతున్నట్లు కొన్ని వారాల క్రితం సంయుక్తంగా ప్రకటించారు.