ఆ తరువాత జోరు, జిల్, శివమ్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ దక్కాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు దర్శక నిర్మాతలు అవకాశాలు ఇవ్వడం జరిగింది. పెద్దగా హిట్ పర్సెంటేజ్ లేకున్నా, జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా నటించే ఛాన్స్ పట్టేసింది రాశి ఖన్నా. రాశి ఖన్నా కెరీర్ లో నటించిన అతిపెద్ద స్టార్ ఎన్టీఆర్ కావడం విశేషం.