Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!

Published : Jun 11, 2026, 08:03 AM IST

పెద్ది కాంట్రవర్సీ నడుస్తున్న టైమ్ లో.. ఒక్కొక్కరుగా హీరోయిన్లు బయటకు వస్తున్నారు. గతంలో ఇలాంటి సమస్యలపై గళం లేపిన వారంతా.. మళ్లీ మొదలు పెట్టారు. రీసెంట్ గా తాప్సీ.. ఇప్పుడు కంగనా. ఏమంటున్నారంటే? 

PREV
16
సోషల్ మీడియాలో పెద్ది దుమారం..
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' సినిమా వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో జాన్వీ పాత్రను చూపించిన తీరు, కొన్ని శృంగార సన్నివేశాలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ హాట్ టాపిక్‌లోకి బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఎంట్రీ ఇచ్చింది.
26
స్పందించిన కంగనా రనౌత్..
తన కొత్త సినిమా 'భారత్ భాగ్య విధాత' ప్రమోషన్స్‌లో కంగనా మాట్లాడింది. సినిమాల్లో మహిళలను చూపించే విధానంపై స్పందించింది. 'సెట్‌లో ఏదైనా సీన్ హీరోయిన్లకు ఇబ్బందిగా అనిపిస్తే, వెంటనే చెప్పాల్సిన బాధ్యత వాళ్లపై ఉంది' అని కంగనా అభిప్రాయపడింది. కేవలం డైరెక్టర్ చెప్పింది చేయడమే కాకుండా, తమ అభిప్రాయం కూడా చెప్పాలని ఆమె పిలుపునిచ్చింది.
36
ఆడవాళ్ల కోణం అర్థం కాదు..
కంగనా ప్రకారం, సినిమాల్లో మహిళలను గ్లామర్ వస్తువుగా చూపించడం ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా జరగదు. 'చాలాసార్లు మగాళ్లు ఓ మూసి ఉన్న గదిలో కూర్చుని కథ రాస్తారు. వాళ్లకు ఆడవాళ్ల కోణం అర్థం కాదు. తాము రాసిన సీన్ అసభ్యంగా ఉంటుందని వాళ్లు గ్రహించలేరు. అప్పుడు ఓ మహిళగా మనం చెప్పాలి. 'ఇది బాగాలేదు' అని చెప్తే వాళ్లు కచ్చితంగా వింటారు. చాలామంది దాన్ని సరిచేయడానికి సిద్ధంగా ఉంటారు' అని కంగనా చెప్పింది.
46
పెద్దిపై రకరకాల విమర్శలు..

'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో నటించింది. సినిమాలో జాన్వీ ముఖం చూపించే ముందే, కెమెరా ఆమె శరీర భాగాలపై ఫోకస్ చేయడం ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఇది నటి శరీరాన్ని వస్తువులా చూపించడమే (Objectification) అని చాలామంది విమర్శించారు. రామ్ చరణ్, జాన్వీ మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాల్లో  సరిగ్గా చూపించలేదనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

56
ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు...
ఈ వివాదాల నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చి బాబు సానా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. 'ఏ మహిళా పాత్రను అవమానించడం మా ఉద్దేశం కాదు' అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రేక్షకులు అభ్యంతరం చెప్పిన కొన్ని సీన్లను థియేటర్లలోని ప్రింట్ల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.
66
కొత్త చర్చకు దారి తీసిన కంగన సలహా..
మొత్తానికి, ఈ గ్లామర్ వివాదానికి కంగనా ఇచ్చిన సలహా ఇప్పుడు సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. సెట్‌లో తమకు ఇబ్బందిగా అనిపిస్తే హీరోయిన్లు మాట్లాడాలన్న కంగనా మాటలు ఎంతవరకు సరైనవి అనే చర్చ మొదలైంది.
Read more Photos on
click me!

Recommended Stories