NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్

Published : Jun 10, 2026, 08:25 PM IST

నందమూరి అభిమానులకు ఇక పండగే.. బాలయ్య సరికొత్త అవతారం చూసి పూనకాలతో ఊగిపోవాల్సిందే. తాజాగా NBK 111 నుంచి ఫస్ట్ గ్లింప్ రిలీజ్ అయ్యింది. ఇందులో బాలకృష్ణ ఎలా ఉన్నాడంటే?

PREV
14
NBK111 నుంచి ఫస్ట్ గ్లింప్స్

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న NBK111 నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం NBK111 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో బాలకృష్ణ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. యాక్షన్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ కలిసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ గా వైరల్ అవుతోంది.

24
పవన్ కళ్యాణ్ ను ఫాలో అయ్యాడా..?

అయితే NBK111 గ్లింప్స్‌లోని కొన్ని విజువల్స్, షాట్స్ తో పాటు కలర్ టోన్‌లు చూసిన నెటిజన్లు పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమాను గుర్తు చేస్తున్నాయని చర్చించుకుంటున్నారు. .గ్లింప్స్ ఓపెనింగ్ ప్రారంభంలోనే 1993 ముంబై నేపథ్యంలో కథ సాగుతుందని సూచిస్తూ ముంబై నగరానికి సంబంధించిన విజువల్స్‌ను చూపించారు. ఈ షాట్స్ OG సినిమాలో కనిపించిన కొన్ని ఫ్రేమ్స్‌ను పోలి ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే వర్షంలో బాలకృష్ణ కనిపించే సన్నివేశాలు, నడుస్తున్నప్పుడు చూపించిన ఫుట్ షాట్స్, చేతిలో కత్తి పట్టుకుని కనిపించే సన్నివేశాలు కూడా OGలో పవన్ కళ్యాణ్ లుక్‌ను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు..

34
ఓజీతో పోలిక పెడుతున్న నెటిజన్లు..

అంతేకాకుండా ఒక వీధిలో జరిగే ఫైట్ సీక్వెన్స్ కూడా OG సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్‌ను పోలి ఉందని కొందరి అభిప్రాయం. బైక్‌పై స్టైలిష్‌గా గన్ పట్టుకుని బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చే షాట్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గ్లింప్స్ మొత్తం కలర్ గ్రేడింగ్, విజువల్ ట్రీట్‌మెంట్ తో బాలకృష్ణ మునుపెన్నడు లేని సరికొత్త అవతారంలో కనిపించాడు. ఇక గ్లింప్స్ చివర్లో బాలకృష్ణ భారీ ప్రొక్లైన్‌పై ఎక్కి కనిపించే సన్నివేశం ప్రభాస్ నటించిన సలార్ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్ని గుర్తు చేస్తోందని కూడా కొందరు అంటున్నారు. మరి బాలయ్యను గేోపీచంద్ ఎలా చూపించాలనుకుంటున్నాడో ముందు ముందు తెలుస్తుంది.

44
సినిమాపై పెరుగుతున్న అంచనాలు..

మరోవైపు ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈ మధ్య వరుసగా బాలయ్య సినిమాలకు తమన్ పనిచేస్తున్నాడు. NBK111 గ్లింప్స్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా OG సంగీత శైలికి దగ్గరగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక బాలయ్య గోపీచంద్ సినిమా ఎలా ఉండబోతోంది. ముందు మందు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్ డేట్స్ వస్తాయో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories