నందమూరి నట సింహం బాలయ్యను రకరకాలుగా వాడేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఆయన బ్రాండ్ ఆల్కాహాల్ గురించి అందరికి తెలిసిందే. ఇక బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఓ బార్ అండ్ రెస్టారెంట్ ప్రకటించిన ఆఫర్ కు జనాల మైండ్ బ్లాక్ అవుతోంది.
బాలకృష్ణ అంటే ఓ బ్రాండ్.. తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది అభిమానులున్న బాలకృష్ణ.. 66 ఏళ్ల వయసులో కూడా అదే మాస్ ఫాలోయింగ్ ను కొనసాగించగలుగుతున్నారు.ఈ ఏజ్ లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇక బాలయ్య ను ఇప్పటికే రకరకాలుగా వాడేస్తున్నారు నెటిజన్లు. ఆయన పేరుతో పలు మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. ‘సర్ సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటి..?’' ‘’ నవ్వొద్దు.. సీరియస్ మ్యాటర్ ‘’ ఇలా బాలయ్య డైలాగ్స్ ఎన్నో మీమ్స్ గా ప్లే అవుతుంటాయి. అంతే కాదు ఆయన బ్రాండ్ ఆల్కహాల్ తో కూడా బాలయ్య బాగా పాపులర్ అయ్యాడు. ఆ బ్రాండ్ కు అంబాసిడర్ గా ఉన్నాడు కూడా.
25
బాలయ్య బర్త్ డే స్పెషల్ ఆఫర్..
ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఓ బార్ ప్రకటించిన స్పెషల్ ఆఫర్ కి అభిమాను మైండ్ బ్లాంక్ అవుతోంది. బాలయ్య అభిమానులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ ఆఫర్ వల్ల.. ఆ బార్ కి జనాలు పోటెత్తారు. ఇంతకీ బార్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫర్లు ఏంటంటే.. ?
35
బాలయ్య బ్రాండ్ మందుతో విందు కూడా..
కాకినాడ బార్ లో...బాలకృష్ణకు ఇష్టమైన బ్రాండ్ ఆల్కాహాల్ పై ఆఫర్ ప్రకటించారు మూడు 60 ఎంఎల్ పెగ్‌లు ఆర్డర్ చేస్తే ..ఆఫర్ కింద మరో 30 ఎంఎల్ పెగ్‌ను ఉచితంగా అందిస్తామని బార్ బయట బోర్డు పెట్టారు.. ఈ ఆఫర్ గురించి తెలిసిన వెంటనే చుట్లుపక్క జనాలు బార్ కి క్యూ కట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసే లిక్కర్‌పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించారు.
ఇదే కాకుండాబాలయ్య అభిమానులకు మరో ప్రత్యేక ఆఫర్‌ను కూడా బార్ యాజమాన్యం ప్రకటించింది. బార్‌లో 5000 కంటే ఎక్కువ బిల్లు చేసిన వారికి 10 శాతం తగ్గింపుతో పాటు ఒక దమ్ బిర్యానీని ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ఈ ఆఫర్ కూడా చుట్టు ప్రక్కల జనాలను, బాలకృష్ణ అభిమానులను బాగా ఆకర్షించింది.
55
బాలకృష్ణ పై అభిమానంతోనే
బాలకృష్ణపై తమకున్న అభిమానంతోనే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు బార్ నిర్వాహకులు తెలిపారు. ఈ ఆఫర్ల న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మొత్తంగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఫ్రీ పెగ్, లిక్కర్‌పై డిస్కౌంట్, ఫ్రీ దమ్ బిర్యానీ ఆఫర్లు చూసి.. బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారు ఏంట్రా బాబు.. అని కొంతమంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు.