ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఆదిత్య అలా మాట్లాడినందుకు భాష బాధపడుతూ కమలతో పటేలు ఏదో తప్పు చేస్తున్నారు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు కమలా అలాగేమీ అయ్యుండదు నన్ను చూసుకోవడానికి మిమ్మల్ని ఇంట్లో ఉంచినట్టు ఉన్నారు అని అంటుంది. కానీ భాష మనసులో ఇంకా అనుమానం ఉంటుంది. ఆ తర్వాత సీన్లో దేవి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని రుక్మిణి, ఆదిత్య బాధపడుతూ ఉంటారు. మనం ఇంత కష్టపడి దేవి మనసు మార్పించింది ఇందుకా? మాధవ్ ఒక్క రోజులో మళ్లీ మొదటికి తీసుకొచ్చేశాడు.
దేవి మనసు మారినందుకు ఎంతో ఆనంద పడ్డాను కానీ అంతా మారిపోయింది అని రుక్మిణి అంటుంది.అప్పుడు ఆదిత్య, మనం ఏం చేసినా ఇంకొక సమస్యతో మళ్ళీ తిరిగి మన వైపు వస్తున్నాడు అని అంటాడు. రామ్మూర్తి గారి లాంటి మంచి మనిషికి అలాంటి కొడుకు ఎలా పుట్టాడో అని బాధపడుతూ ఉంటారు ఇద్దరు. నువ్వు భయపడోద్దు నీ భయమే వాడికి ధైర్యం ఇస్తుంది అని అంటాడు ఆదిత్య. నా భయం వాడి మీద కాదు పిల్లలు మనసుల్ని ఎక్కడ మార్చేస్తాడో అని అంటుంది రుక్మిణి.
మళ్లీ మాధవ్ ఏదో ఒకటి చేసే లోపల ఇవన్నీటికి పరిష్కారం ఆలోచించి దేవి మనసును ఎలాగైనా మార్చేలా చేయ పెనిమిటి అని రుక్మిణి ఆదిత్య కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో కమలకి పురుడు నొప్పులు వచ్చి అక్కడ పడిపోయి అరుస్తూ ఉంటుంది.ఈ లోగ సత్యా దేవుడమ్మ భాషా అక్కడికి వచ్చి కమలని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. బయట ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఈలోగా కమల ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ వెళ్లి చూసి సంబరపడిపోతూ ఉంటారు. అందరూ ఆ పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు.
ఆదిత్య అక్కడికి వచ్చి ఆ బిడ్డను చూసి ఎత్తుకొని ఆనందపడతాడు. అప్పుడు దేవుడమ్మ ఇంత కాలానికి మన ఇంట్లో పసిదాని కేరింతలు వినిపించబోతున్నాయి అని ఆనందపడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడో పుట్టి ఉంటే మన ఇల్లు ఇప్పటికీ బిడ్డలతో కళకళలాడుతూ ఉండేది అని దేవుడమ్మ అనగా సత్య ఆదిత్యలు బాధపడతారు. అప్పుడు ఆదిత్య దేవి, మా నాయన ఎంత గలీసుడైన నాకు నాయనే కదా నాకు ఎలాగైనా మా నాయన కావాలి అని అన్న మాటలు గుర్తుతెచ్చుకొని బాధపడతాడు. ఆ తర్వాత సీన్లో సత్యా రుక్మిణికి ఫోన్ చేసి కమలక్క కి ఆడబిడ్డ పుట్టింది అని చెప్తుంది.
అప్పుడు రుక్మిణి చాలా ఆనంద పడిపోయి ఏ హాస్పిటల్ అని వివరాలని కనుక్కుంటుంది. వద్దాము అనుకోని లోపల తను రావడం కుదరదు అని విషయం గ్రహించి మొఖం మాడి చేస్తుంది రుక్మిణి.పిల్ల జాగ్రత్త అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఈ విషయం భాగ్యమ్మకు చెప్తుంది. భాగ్యమ్మ ఎంతో ఆనందపడి నేను వెంటనే వెళ్లి చూసి వస్తాను అని అంటుంది. నాకు కూడా చూడాలని ఉంది అని రుక్మిణి అనగా సరే అని ఇద్దరు బయలుదేరుతారు. ఈలోగ అక్కడ హాస్పిటల్లో అందరూ ఆనందంగా మాట్లాడుకుంటే ఉంటారు. ఇంతటిలో భాగ్యమ్మ, రుక్మిణిని కిటికీ వైపు నుంచి వెళ్ళమని చెప్తుంది.
రుక్మిణి కిటికీలో నుంచి ఆ పాపని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇంతట్లో రుక్మిణి ఆ గది లోపలికి వెళ్తుంది. దేవుడమ్మ ఆ పాపతో మీ పిన్ని వచ్చింది చూడు అని ఆ బిడ్డని రుక్మిణి చేతిలో పెడుతుంది. అప్పుడు ఆ పాప ఏడుపు ఆపేస్తుంది. అప్పుడు దేవుడమ్మ మీ పిన్ని వచ్చిన వెంటనే నువ్వు ఏడుపాపేసావే అని అంటుంది.అందరూ రుక్మిణి రావడంతో సంతోషపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!