Thug Life Twitter Review: 'థగ్ లైఫ్' ట్విట్టర్ రివ్యూ, హైలైట్స్ ఇవే.. కమల్ హాసన్ మూవీ హిట్టా ఫట్టా ?

Published : Jun 05, 2025, 06:46 AM IST

నేడు గురువారం జూన్ 5న థగ్ లైఫ్ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి రెస్పాన్స్ మొదలైంది.

PREV
16
'థగ్ లైఫ్' ట్విట్టర్ రివ్యూ

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో 38 ఏళ్ళ తర్వాత వస్తున్న చిత్రం థగ్ లైఫ్. 1987లో వీరి కాంబినేషన్ లో నాయకన్ చిత్రం వచ్చింది. ఆ తర్వాత కమల్.. మణిరత్నం దర్శకత్వంలో నటించలేదు. మళ్ళీ ఇప్పుడు నటిస్తున్నారు. ఈ చిత్రంలో శింబు, త్రిష, నాజర్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, రవి మోహన్ కీలక పాత్రల్లో నటించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు, ఈ చిత్రంలో త్రిష, అభిరామితో రొమాన్స్ లాంటి కాంట్రవర్సీల వల్ల థగ్ లైఫ్ మరింతగా వార్తల్లో నిలిచింది. 

26
థగ్ లైఫ్ గ్రాండ్ రిలీజ్ 

నేడు గురువారం జూన్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ట్విట్టర్ లో ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి రెస్పాన్స్ మొదలైంది. మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉందా ? ఈ చిత్రం చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది ? అనేది ఇప్పుడు చూద్దాం. 

36
ప్రేక్షకుల రెస్పాన్స్ 

థగ్ లైఫ్ మూవీ చూసిన ఆడియన్స్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ లో కథ రొటీన్ గా అనిపించినప్పటికీ దర్శకుడిగా మణిరత్నం అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆకట్టుకుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం అయితే సినిమాకే హైలైట్ అని అంటున్నారు. 

46
గ్యాంగ్ స్టర్ కథ 

హీరో శింబు పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. గ్యాంగ్ స్టర్స్ వారి మధ్య తలెత్తే విభేదాలపై మణిరత్నం ఈ చిత్ర కథ రూపొందించారు. కమల్ హాసన్ ఫన్ తో కూడుకున్న డైలాగ్ డెలివరీ, వైవిధ్యంతో కూడుకున్న నటనతో మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ నటనలో కొత్త స్టైల్ కనిపిస్తుందని ఆడియన్స్ అంటున్నారు. సెకండ్ హాఫ్ కి అద్భుతంగా స్టేజి సెట్ చేశారు. రివేంజ్ డ్రామా ఈ చిత్రంలో ఉత్కంఠ కలిగిస్తోంది. ముందుగా చెప్పినట్లుగా విజువల్స్ బావున్నప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో ఏ ఆర్ రెహమాన్ పూర్తిస్థాయిలో పనితనం చూపించలేదు. కమల్, శింబు మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. 

56
సినిమాలో మైనస్ లు 

చాలా మంది ఆడియన్స్ ఈ చిత్ర కథ ప్రిడిక్టబుల్ గా ఉందని, కొత్తదనం లేదని అంటున్నారు. మణిరత్నం వీలైనంత వరకు ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి ప్రయత్నించారు. ఆధిపత్యం కోసం గ్యాంగ్ స్టర్స్ ప్రయత్నించడం కొత్త పాయింట్ కాదు. ఆ సన్నివేశాలని సాగదీసినట్లు చెబుతున్నారు. త్రిష, అభిరామిలతో కమల్ నటించిన రొమాంటిక్ సన్నివేశాలు అవసరం లేనివి అని అంటున్నారు. 

66
ఓవరాల్ గా ఎలా ఉందంటే.. 

అక్కడక్కడా కొన్ని ఎంగేజింగ్ సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ మణిరత్నం ఈ చిత్రాన్ని చాలా నెమ్మదిగా నడిపించడం మైనస్ గా మారింది. ఇక సెకండ్ హాఫ్ ని దర్శకుడు ఎమోషనల్ గా నడిపించారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకి మణిరత్నం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ పాత్రల్లో డెప్త్ లేకపోవడం మరో మైనస్. టెక్నికల్ గా ఈ చిత్రం బావున్నప్పటికీ.. ఇతర అంశాల్లో లోపాల కారణంగా థగ్ లైఫ్ మూవీ యావరేజ్ చిత్రం అని ఆడియన్స్ అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories