సనా ఖాన్ తన భవిష్యత్తు గురించి, తన ప్లాన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అవి ఆమె వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు కారణమయ్యాయి. సనా ఖాన్ భర్త గుజరాత్‌లోని సూరత్ కు చెందిన వ్యక్తి. పేరు ముఫ్తీ అనస్ సయ్యద్. ఆయన ఒక మత నాయకుడు, ఇస్లామిక్ పండితుడు. సనా ఎజాజ్ ఖాన్ ద్వారా ముఫ్తీకి పరిచయమైంది.