తెలుగుతో పాటు.. తమిళ బిగ్ బాస్ రియాల్టీ షో ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది 8వ సీజన్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన కంటెస్టెంట్స్ సెలక్షన్ కూడా జరుగుతుంది. ఇటు తెలుగు.. అటు తమిళ కంటెస్టెంట్స్ ఎంపిక ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ షో ప్రోమో షూట్ త్వరలో జరుగుతుందని సమాచారం. అయితే ఈలోపు స్టార్ హీరో కమల్ హాసన్ హఠాత్తుగా షో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈప్రకటనతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు
జూనియర్ ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఎన్నో తెలుసా..? అన్నీ సూపర్ హిట్ పాటలే..
తెలుగు బిగ్ బాస్ ను రెండు సీజన్లు తరువాత నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండగా.. ప్రస్తుతం 8వ సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేయబోతున్నాడు. అయితే తమిళ బిగ్ బాస్ ను మొదటి నుంచి 7వ సీజన్ వరకూ కమల్ హాసన్ హోస్ట్ చేస్తూ వచ్చారు. సడెన్ గా 8వ సీజన్ కు ఆయన తప్పుకోవడం ఫ్యాన్స్ లో నిరాశను కలిగించింది.
తమిళ రాజకీయాల్లోకి రోజా జంప్..? విజయ్ దళపతి పార్టీలో కి వెళ్తుందా..?
bigg boss tamil 6
అయితే వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల బిగ్ బాస్ హోస్ట్ గా కొనసాగలేకపోయానని కమల్ హాసన్ ప్రకటనలో పేర్కొన్నాడు. కమల్ నిష్క్రమణ తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ హోస్ట్ ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. నెక్ట్స్ బిగ్ బాస్ హోస్ట్ ఎంపిక ను వేగం చేశారు బిగ్ బాస్ టీమ్. ఈక్రమంలో బిగ్ బాస్ నుండి కమల్ నిష్క్రమణపై విజయ్ టీవీ కీలక ప్రకటన విడుదల చేసింది.
vijay tv
ఈప్రకటనలో ఏముందంటే... 7 సంవత్సరాలుగా మీరు చేసిన అసమానమైన సహకారం అందించినందుకు ధన్యవాదాలు కమల్ సార్, మీరు ప్రేక్షకులతో మాత్రమే కాకుండా పోటీదారులతో కూడా మాట్లాడి, వారిలో ఉత్తమమైన వాటిని బయటకు తీసుకువచ్చారు. అందుకే బిగ్ బాస్ తమిళ షో భారతదేశంలోనే నంబర్ 1 రియాల్టీ షోగా నిలిచింది. మీరు షో నుండి విరామం తీసుకుంటున్నారని ప్రకటించడానికి మేము చాలా బాధపడ్డాము.
Bigg boss tamil
అయినప్పటికీ, మేము మీ కారణాలను గౌరవిస్తాము మరియు మీకు మద్దతునిస్తూనే ఉంటాము. మీరు లేకుండా మేము బిగ్ బాస్‌ని చాలా మిస్ అవుతున్నాము.. కానీ హోస్ట్‌గా మీ వారసత్వం మాకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. మీ సినిమా కెరీర్‌కి ఆల్ ది బెస్ట్. ఈ బిగ్‌బాస్ సీజన్‌ను విజయవంతంగా నిర్వహిస్తామని కమల్ కు వారు మాట ఇచ్చారు. ఇక విజయ్ టీవి కొత్త హోస్ట్ పై ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం ఎవరంటారన్న హింట్ కూడా బయటకు రాలేదు.