Bigg Boss Telugu 8: అమర్ దీప్ భార్యతో పాటు ఫస్ట్ కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ వీరే!

First Published | Aug 9, 2024, 6:36 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. కంటెస్టెంట్స్ ఎంపిక ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అమర్ దీప్ భార్యతో పాటు కొందరు సెలెబ్స్ కన్ఫర్మ్ అయ్యారట. 
 


బిగ్ బాస్ షో అంటే మొదట ఆసక్తిరేపే అంశం కంటెస్టెంట్స్. పేరున్న, బాగా తెలిసిన మొహాలు హౌస్లోకి వెళితే ఆ కిక్కే వేరు. మొదటి మూడు సీజన్స్ వరకు బిగ్ బాస్ తెలుగులో టాప్ సెలెబ్స్ ప్రవేశించారు. హీరోలు, హీరోయిన్స్, నటులు భాగమయ్యారు. సీజన్స్ గడిచేకొద్దీ టాప్ సెలెబ్స్ కరువయ్యారు. సీజన్ 4లో కరోనా కారణంగా చాలా వరకు అసలు తెలియని కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. 
 

Bigg boss telugu 8

సీజన్ 7లో కొంచెం పర్లేదు. శివాజీ, అమర్ దీప్, ప్రియాంక సింగ్, శోభా శెట్టి, అర్జున్ అంబటి వంటి పరిచయం ఉన్న నటులు కంటెస్టెంట్ చేశారు. ఈసారి సోషల్ మీడియా స్టార్స్ తో పాటు బుల్లితెర నటులు అధికంగా ఉండే అవకాశం కలదు. ప్రస్తుతానికి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. నిజంగా హౌస్లోకి వెళ్ళేది ఎవరు అనేది చివరి వరకు చెప్పలేం. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ రోజు మాత్రమే కంటెస్టెంట్స్ ఎవరనేది తెలియాలి. 



కానీ అధికారిక ప్రకటనకు ముందు లిస్ట్ లీక్ అవుతుంది. కారణం ఎంపికైన కంటెస్టెంట్స్ వివరాలు తెలియజేసే AV షూట్లు జరుగుతాయి. ఎడిటింగ్ రూమ్స్ నుండి కూడా లిస్ట్ లీక్ అవుతుంది. ప్రస్తుతానికి బిగ్ బాస్ తెలుగు 8 లిస్ట్ అంటూ... కిరాక్ ఆర్పీ, బర్రెలక్క, బంచిక్ బబ్లు, యాదమ్మ రాజు, రీతూ చౌదరి, విష్ణు ప్రియ, అంజలి పావని, తేజస్విని గౌడ, అబ్బాస్, వింధ్యా, నటుడు రోహిత్, సీరియల్ నటుడు ఇంద్రనీల్, అమృత ప్రణయ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. 
 

Bigg boss telugu 8

వీరిలో నలుగురు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారట. యూట్యూబర్ బంచిక్ బబ్లు బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్ గా ఎంపిక అయ్యాడంటూ సమాచారం అందుతుంది. అలాగే అమర్ దీప్ భార్య తేజస్విని గౌడ కంటెస్ట్ చేస్తున్నారట. బుల్లితెర నటి, యాంకర్ అంజలి పావని కూడా లిస్ట్ లో ఉన్నారట. అలాగే రీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడం ఖాయం అంటున్నారు. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంపిక క్లిష్టంగా ఉంటుంది. అన్నీ కుదిరాక రెమ్యూనరేషన్ వద్ద తేడా వచ్చినా మరొకరిని ఎంచుకుంటారు. అయితే టాప్ సెలబ్రిటీలు, కెరీర్ పరంగా ఫార్మ్ లో ఉన్నవాళ్లు బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. బిగ్ బాస్ షో వలన మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని భావించడమే ఇందుకు కారణం. బిగ్ బాస్ టైటిల్ విన్నర్స్ కూడా పరిశ్రమకు దూరమయ్యారు. 
 

Latest Videos

click me!