అక్కినేని నాగ చైతన్య, తెలుగు పిల్ల శోభిత ధూళిపాల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గురువారం రోజు ఆగష్టు 8న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు చైతన్య, శోభిత గురించి ఫ్యాన్స్, నెటిజన్లు రూమర్స్ మాత్రమే వింటూ వచ్చారు.అవే రూమర్స్ నిజం కావడంతో ఫ్యాన్స్ తో పాటు, చిత్ర పరిశ్రమ కూడా ఆశ్చర్యపోయింది.