టెక్నాలజీని సినిమాకోసం వాడుకోవడంలో కమల్ హాసన్ దే పై చేయింది. అందుకోసం ఆయన స్టూడెంట్ గా మారుతుంటారు. గతంలో ఆయన సినిమాల కోసం.. వేసిన గెటప్ ల కోసం ఎంత టైమ్ తీసుకున్నా సరే.. వాటికి సంబంధించిన విషయాలు పర్ఫెక్ట్ గా నేర్చుకునేవారు.
తనకంటే చిన్నవారి దగ్గర నేర్చుకోవడానికి కూడా కమల్ హాసన్ వెనకాడరు. అందులో బాగంగానే ఆయన టెక్నాలజీకి సబంధించిన విధ్యార్దిగా మారిపోయారు.
ఆయన చాలా సినిమాల్లో టెక్నాలజీని బాగా వాడేవారు. దశావతారం లాంటి సినిమాలలో 10 గెటప్స్ వేయడానికి ఆయన చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. సినిమా కోసం అంత కష్టపడతారు కమల్. తాజాగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు నేర్చుకునేందుకు రెడీ అయ్యారు.