నామినేషన్స్ డేలో నాగ మణికంఠ మరింత ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టాడు. బాల్యంలోనే తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్లి చేసుకుంది. పెంపుడు తండ్రి వలన అవమానాలు, కష్టాలు పడ్డాను. చివరికి నా తల్లి మరణిస్తే దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక అడుక్కున్నాను, అంటూ ఏడ్చేశాడు. దాంతో నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి.