వీరిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు, కనీసం ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదు. అయినా, వీరి మధ్య ఇంత సాన్నిహిత్యం ఎలా అనేది ఆసక్తికరంగా మారింది. దీని గురించి కమల్ ప్రస్తావిస్తూ, సాహిత్యంలో వచ్చే కోప్పెరుంజోళన్ - పిసిరాందైయార్ స్నేహాన్ని ఉదాహరణగా చెబుతారు. అంటే ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోకుండానే ఒకరిపై ఒకరు గొప్ప గౌరవం, ప్రేమ కలిగి ఉండేవారు. కమల్, మమ్ముట్టిల స్నేహం కూడా అలాంటిదే. ఒకరినొకరు దూరం నుంచి ఆరాధించడమే కాకుండా, ఒకరి నటనను మరొకరు నిజాయితీగా చర్చించుకుని, విమర్శించుకుని తమను తాము మెరుగుపరుచుకోవడమే వీరి 40 ఏళ్ల స్నేహ బంధానికి విజయ రహస్యం.