Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం

Published : Jan 26, 2026, 10:51 PM IST

హీరోయిన్‌ ఈషా రెబ్బా సెట్‌లో తరుణ్‌ భాస్కర్‌తో చెంపదెబ్బలు తిన్నదట. అంతేకాదు మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఆయన చెంప చెల్లుమనిపించిందట. మరి ఆ కథేంటో తెలుసుకుందాం. 

PREV
15
ఓం శాంతి శాంతి శాంతిః తో రాబోతున్న ఈషా రెబ్బా

తెలుగు అందం ఈషా రెబ్బా కొంత గ్యాప్‌ తో ఇప్పుడు `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటించింది. తరుణ్‌ భాస్కర్‌ హీరోగా, ఏఆర్‌ సజీవ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సృజన్‌ ఎరబోలు, అనూప్‌ చంద్రశేఖర్‌ నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో హీరోయిన్‌ ఈషా రెబ్బా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. సెట్‌లో హీరో తరుణ్‌ భాస్కర్‌ తన చెంప చెల్లుమనిపిస్తే, తాను కూడా ఆయన చెంప చెల్లుమనిపించిందట. ఆ విషయాలను షేర్‌ చేసుకుంది. 

25
ఈషాని చెంప దెబ్బ కొట్టిన తరుణ్‌ భాస్కర్‌

`ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ భార్యాభర్తల మధ్య జరిగే కథ. ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది. పాత్రల మధ్య సీరియస్‌నెస్‌ నుంచి ఫన్‌ జనరేట్‌ అవుతుంది. అదే సినిమాకి పెద్ద అసెట్‌. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. ఈ క్రమంలో ఈ మూవీలోని తరుణ్‌ భాస్కర్‌ ని చెంపదెబ్బ కొట్టే సన్నివేశాల గురించి ఈషా రెబ్బా ఓపెన్‌ అయ్యింది. సోమవారం ఆమె మీడియాతో ముచ్చటిస్తూఈ విషయాలను పంచుకుంది. సినిమాలో హీరో హీరోయిన్‌ ని కొట్టాల్సి ఉంటుంది. ఓ సన్నివేశంలో పిండి హీరోయిన్‌ చెంపకి అంటాలి. అది అంటుకోవడం లేదు, దీంతో గట్టిగానే కొట్టాల్సి వచ్చిందట. తరుణ్‌ కొట్టడంతో తన చెంపకి దెబ్బ తగిలి నొప్పి వచ్చిందని, దీంతో కన్నీళ్లు వచ్చాయని, నిజంగానే ఆయా సీన్ లో ఏడ్చినట్టు తెలిపింది ఈషా.

35
మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని తరుణ్‌ పై ఈషా ప్రతీకారం

అంతేకాదు ఇలాంటి సన్నివేశం తరుణ్‌ భాస్కర్‌పై కూడా ఉందట. తాను నెమ్మదిగా కొడితే పిండి అంటుకోవడం లేదని, తాను కూడా గట్టిగానే కొట్టిందట. దీంతో తరుణ్‌కి కూడా దెబ్బతగిలిందని, ఆయనకు కూడా నొప్పి వచ్చిందని చెప్పింది. మొత్తంగా తనని కొట్టినందుకు తరుణ్‌ భాస్కర్‌పై ఈషా కూడా ప్రతీకారం తీర్చుకుందని చెప్పొచ్చు. అయితే ఇదంతా తమ మధ్య సరదాగా సాగిందని తెలిపింది ఈషా. ఈ మూవీ కోసం తాను కొంత వరకు మార్షల్‌ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుందట. బేసిక్‌ మెలకువలు నేర్చుకున్నట్టు చెప్పింది. మొత్తంగా మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని తరుణ్‌ని కొట్టిందని చెప్పొచ్చు.

45
యాక్షన్‌ అంటే ఇష్టం

తనకు యాక్షన్‌ చేయడమంటే ఇష్టమని, ఈ సినిమా ఒప్పుకోవడానికి అది కూడా ఓ కారణమని తెలిపింది. అయితే ఎవరినైనా బాగా కొట్టాలని ఉంటుందని, కానీ ఆ అవకాశం రావడం లేదని(నవ్వుతూ) చెప్పింది ఈషా. సినిమా ఆద్యంతం ఫన్సీగా సాగుతుందని, ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని, ప్రతి ఒకరు రిలేట్‌ అవుతారని తెలిపింది. గోదావరి యాసలో మాట్లాడటం పెద్ద సమస్య కాలేదని, అమ్మది రాజమండ్రి కావడంతో, హాలీడేస్‌ కి అక్కడికి వెళ్లేదట. అలా ఆ యాసపై పట్టు వచ్చిందని చెప్పింది. తరుణ్‌ మాత్రం గోదావరి యాస కోసం కష్టపడాల్సి వచ్చిందని చెప్పింది. ఈమూవీ మలయాళంలో వచ్చిన `జయ జయ జయ జయహే` కి రీమేక్‌. కాకపోతే తెలుగులో చాలా మార్పులు చేశారని, మన తెలుగు సినిమా చూసిన ఫీలింగ్‌ ఉంటుందని చెప్పింది.

55
కెరీర్‌ కి బ్రేక్‌ ఇచ్చే మూవీ ఓం శాంతి శాంతి శాంతిః

ఇక తనకెరీర్‌ గురించి చెబుతూ, ఇటీవల కొంత గ్యాప్‌ వచ్చిన మాట నిజమే అని, బలమైన కథ, సినిమాలో తన పాత్రకి ప్రయారిటీ ఉంటుందని, నమ్మకం కలిగిన తర్వాతనే సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది. అందుకే గ్యాప్‌ వచ్చినట్టు పేర్కొంది. ఒకప్పుడు తెలుగుఅమ్మాయిలకు ఆఫర్లు వచ్చేవి కావు, కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చాక అవకాశాలు పెరిగాయి. టాలెంట్‌ ఉన్న వారికి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పింది ఈషా. తాను కూడా సెలక్టీవ్‌గా వెళ్తున్నట్టు పేర్కొంది. అదే సమయంలో `ఓం శాంతి శాంతి శాంతిః` మూవీ తనకు వ్యక్తిగతంగా చాలా హెల్ప్అవుతుందని, తన కెరీర్‌ బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories