ఎపిసోడ్ ప్రారంభంలో ఆరు నెలలలో 10 లక్షల రూపాయలు, రెండు రోజుల్లో 50 వేల రూపాయలు కట్టమని తీర్పు ఇస్తారు పెద్ద మనుషులు. అంత డబ్బు రెండు రోజుల్లో కట్టలేము అంటాడు కృష్ణమూర్తి. అనవసరంగా లేనిపోని కేసుల్లో ఇరుక్కోవటం ఎందుకు డబ్బు కట్టేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పెద్ద మనుషులు. అంత డబ్బు ఎలా కట్టడం అని ఆలోచనలో పడతారు కృష్ణమూర్తి దంపతులు.